పవన్ కళ్యాణ్ ట్రైనింగేంటి.. అల్లు అరవింద్ ఆరా తీయడమేంటి.. వినడానికి చాలా చిత్రంగా అనిపిస్తోంది కదూ. ఐతే ఇది ఇప్పటి మాట కాదులెండి. రెండు దశాబ్దాల కిందటి వ్యవహారం ఇది. తన అన్నయ్య బాటలో నటనలోకి వద్దామని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నాక అతణ్ని వైజాగ్ సత్యానంద్ దగ్గర శిక్షణకు పంపించిన సంగతి తెలిసిందే. ఐతే నటనలో శిక్షణకు పంపనైతే పంపారు కానీ.. పవన్ మీద అసలు మెగా ఫ్యామిలీలో ఎవరికీ నమ్మకమే లేదట. మరోవైపు సత్యానంద్ కు కూడా సినిమా నటులు ఎవరికీ శిక్షణ ఇచ్చిన అనుభవం కూడా లేదు. దీంతో అసలు ఆ శిక్షణ ఎలా సాగుతోందో.. అసలు పవన్ అక్కడ కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాడో లేదో అరవిందే ఆరాతీశాడట. ఈ సంగతి ఒక ఇంటర్వ్యూలో సత్యానంద్ వెల్లడించాడు.
‘‘కళ్యాణ్ చాలా రిజర్వ్డ్ పర్సన్ కావడం.. ఎవరితో సరిగా కలిసేవాడు కాకపోవడంతో అతను సినిమాల్లోకి వస్తాననగానే ఇంట్లోవాళ్లందరూ సందేహించారు. అతను నెగ్గుకు రాలేడనుకున్నారు. ఒక్క చిరంజీవి గారు మాత్రమే కళ్యాణ్ మీద కొంచెం నమ్మకం పెట్టుకున్నారు. ఐతే నా దగ్గరికి వచ్చాక అసలు శిక్షణ ఎలా సాగుతోందో అని సందేహంతో అరవింద్ గారు నాకు తెలియకుండా కళ్యాణ్ కు ఫోన్ చేశారు. అంతా ఓకేనా.. అసలు కంటిన్యూ అవుతావా అని అడిగినట్లు తెలిసింది. చాలా ఆసక్తికరంగా ఉందని.. క్లాసులు సైంటిఫిగ్ గా ఉన్నాయని.. తాను ఇక్కడే ఉండి కోర్సు పూర్తి చేస్తానని పవన్ చెప్పాడట. ఈ సంగతి ఆ తర్వాత నాకు తెలిపాడు. రోజుకు 15 గంటలకు పైగా పవన్.. నేను కలిసి మూడు నెలల పాటు ట్రావెల్ చేశాం. ఇద్దరం ఒకే గదిలో ఉండేవాళ్లం’’ అని సత్యానంద్ తెలిపాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/