ఈరోజుల్లో పుస్తకాలు చదివేవారు ఎంతమంది ఉంటారు..? సెల్ ఫోన్ లు - ట్యాబ్ లు అందుబాటులోకి వచ్చాక... ఖాళీ సమయాల్లో వాటిల్లోకి తలలు దూర్చేసేవారే తప్ప, ఏదో ఒక పుస్తకం పట్టుకుని కనిపించేవారు చాలా కొద్దిమంది ఉంటారు. నిజానికి - పుస్తక పఠనం అనేది మంచి అలవాటు. మిగతా రంగాల వారి మాట ఎలా ఉన్నా మీడియాలో ఉన్నవారూ, సినీరంగానికి చెందినవారూ తప్పకుండా పుస్తకాలు చదవాలని అనుభవజ్ఞులు చెబుతూ ఉంటారు. సినీ రంగాన్నే తీసుకుంటే ఆ అలవాటు ఉన్న దర్శకులూ రచయితలూ ఈ రోజుల్లో చాలా తక్కువ! ఇక, నటీనటుల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. నూటికో కోటికో ఒక నటుడికి రీడింగ్ హ్యాబిట్ ఉంటుంది. అలాంటి వారిలో ఒకరు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆయన తరచూ ఏదో ఒక పుస్తకం చదువుతూ ఉంటారని సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఈ మధ్యనే గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ఆధునిక మహాభారతం పుస్తకాన్ని పవన్ చదివారట! అది ఆయనకి చాలాబాగా నచ్చేసింది. దీంతో ఆయన ఆ పుస్తకాన్ని పునర్ముద్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే... పవన్ కల్యాణ్ కు పుస్తకాలంటే చిన్నప్పటి నుంచీ చాలా ఇష్టం అని చెబుతున్నారు సీనియర్ రచయిత సత్యానంద్.
పవన్ కు చిన్నప్పటి నుంచీ పుస్తకాలు అంటే మహా పిచ్చి అనీ, కొత్త బుక్స్ ఉన్నాయని తెలిస్తే మా ఇంటికి నడుచుకుంటూ వచ్చేసేవాడని సత్యానంద్ గుర్తు చేసుకున్నారు. ఆరోజుల్లో చిరంజీవిగారి ఇంటికి స్టోరీ చర్చల కోసం తాను తరచుగా వెళ్తూ ఉండేవాడినని సత్యానంద్ చెప్పారు. అలా వెళ్తున్నప్పుడు, ఆ ఇంట్లో సైలెంట్ గా కూర్చుని పవన్ కల్యాణ్ కనిపించేవాడట. పలకరిస్తే మాట్లాడేవాడనీ, పుస్తకాల గురించి చర్చ మొదలుపెడితే ఎంతో ఆసక్తిగా వినేవాడని అన్నారు. అప్పుడప్పుడూ తన ఇంటికి పవన్ వచ్చేవాడనీ, ఏదైనా పుస్తకం ఇస్తే అక్కడే కూర్చుని చదివేసేవాడని చెప్పారు. అంతేకాదు, ఒక్కోసారి పవన్ తో వాకింగ్ కి వెళ్లినప్పుడు పుస్తకాల గురించి - రచనల గురించి తన అభిప్రాయాలను ఎంతో చక్కగా వ్యక్తీకరించేవాడు అని మెచ్చుకున్నారు. పదిహేడేళ్ల వయసులోనే పవన్ కి పుస్తకాల పట్ల అంత ఆసక్తి ఉండటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించేదని సత్యానంద్ తాజాగా చెప్పారు. సో... మన పవర్ స్టార్ కు అప్పటి నుంచే ఈ పఠనాసక్తి ఉందన్నమాట! పవన్ అభిమానులు ఈ విషయం తెలుసుకుని ఫాలో అవుతారా..? మంచి అలవాటే కదా!