దాసరి నారాయణరావు .. తెలుగు తెరతో పరిచయమున్నవారికి ఆయన పేరును పరిచయం చేయవలసిన అవసరం లేదు. కుటుంబ కథా చిత్రాల ద్వారా ఆయన అశేష ప్రేక్షకులను అలరించారు. తెలుగు చిత్రపరిశ్రమకి ఎన్టీఆర్ .. ఏఎన్నార్ రెండుకళ్ల వంటివారు.
ఆ ఇద్దరితోను వరుస సినిమాలను తెరకెక్కించి ఘనవిజయాలను నమోదు చేసినవారాయన. తెలుగు సినిమా కథాకథనాలను కొత్త పుంతలు తొక్కించినవారాయన. అలాంటి దాసరి నారాయణరావు 'పాలకొల్లు'లో పుట్టి పెరిగారు. ఆయన బాల్యం .. చదువుకునే రోజులను గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది.
ఆ విషయాలను గురించి తాజా ఇంటర్వ్యూలో ఆయన సోదరుడు సత్యనారాయణమూర్తి ప్రస్తావించారు. "మేము ముగ్గురం అన్నదమ్ములం. ముగ్గురం కూడా మా అమ్మానాన్నల మాటను గౌరవించేవాళ్లం. మధ్యతరగతి కుటుంబం కావడంతో, మమ్మల్ని చదివించడానికి మా అమ్మానాన్నలు చాలా ఇబ్బందులు పడ్డారు.
మేమంతా ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం మా అమ్మానాన్నలే. దాసరి నారాయణరావు చదువుకునే రోజుల నుంచే ఆయన స్నేహితుల్లో అంతా ధనవంతులు ఉండేవారు. అంత ధనువంతుల బిడ్డలు కూడా ఆయన పుస్తకాలు మోసేవారు. వాళ్లతో అంత స్నేహంగా ఉండేవాడు.
6వ తరగతి చదువుతున్న రోజుల్లోనే ఆయన నాటకాలు రాసేవాడు .. ఆ నాటకాలకి ఆయనే డైరెక్టర్ గా ఉండేవాడు. నారాయణరావు నాటకాలంటూ తిరగడం నాన్నగారికి ఇష్టం ఉండేది కాదు .. నాటకాలు కూడు పెడతాయా? అని ఆయన అనేవారు.
అయినా వినిపించుకోకుండా నాటకాలు ఆడేసి .. అర్ధరాత్రివేళ దొడ్డిదారిలో ఇంట్లోకి వచ్చేవాడు. అప్పటివరకూ మెలకువతో ఉండి అమ్మనే దొడ్డి తలుపు తీసేది .. అన్నం పెట్టేది. అందుకేనేమో .. చివరివరకూ అమ్మని ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. స్కూల్ అయిన తరువాత వాడు ఇంటికి వచ్చి చదవడాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. క్లాస్ లో విన్నదే రాసేవాడు .. పాసైపోయేవాడు.
పాలకొల్లులో 'రత్నం' టాకీస్ అని ఉండేది. అందులో 'రోజులు మారాయి' సినిమా 50 రోజుల ఫంక్షనో .. 100 రోజుల ఫంక్షనో చేశారు. అప్పుడు ఏఎన్నార్ - వహీదా రెహమాన్ వచ్చారు .. వాళ్ల ఊరేగింపు తీశారు. అవి ఇంకా దాసరి నారాయణరావు చదువుకునే రోజులు.
ఆయనకి ఏఎన్నార్ అంటే ఎంతో అభిమానం. అందువలన ఆయనను చూడటానికి వెళ్లి, జనం తోసేయడంతో కాలవలో పడిపోయాడు. ఆ సయమంలో అక్కడున్నవారెవరో ఆయనను కాపాడి పైకి తీసుకుని వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న నాన్నగారు ఆయనను కేకలేశారు కూడా" అని చెప్పుకొచ్చారు.