రోహిత్ సావిత్రికి 'యు' వచ్చింది

Update: 2016-03-23 12:44 GMT
నారా రోహిత్ ఈ ఏడాది మంచి జోరు మీద ఉన్నాడు. గతవారం తుంటరి విడుదల చేసి హిట్ కొట్టిన ఈ హీరో మరో వారం రోజుల్లో కొత్తి సినిమాను సిల్వర్ స్క్రీన్ పైకి తేనున్నాడు. ఏప్రిల్ 1న నారా రోహిత్ - నందిత జంటగా నటించిన 'సావిత్రి' విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు కూడా ప్రారంభించేయగా.. ఇప్పుడు సావిత్రికి సెన్సార్ సర్టిఫికేట్ కూడా వచ్చేసింది.

ఈ మూవీకి క్లీన్ యూ సర్టిఫికేట్ ను అందించడమే కాదు.. మంచి సినిమాను తీసినందుకు యూనిట్ ని అభినందించింది సెన్సార్ బోర్డ్. విభిన్న చిత్రాలతో అలరిస్తున్న నారా రోహిత్ కెరీర్ లో.. సావిత్రి కీలకంగా నిలవనుంది. నందమూరి నటసింహం బాలకృష్ణ చేతుల మీదుగా ఆడియో లాంఛ్ కావడంతో.. నందమూరి అభిమానులు కూడా ఈ మూవీని ఆసక్తిగా గమనిస్తున్నారు. స్టోరీ ప్రకారం సింపుల్ గానే కనిపిస్తుంది సావిత్రి.. ఆవారాగా తిరిగే ఓ కుర్రాడు.. హీరోయిన్ ని ట్రైన్ లో చూసి ప్రేమలో పడతాడు.

అప్పటికే హీరోయిన్ కి పెళ్లి ఫిక్స్ అవడంతో.. దాన్ని చెడగొట్టి తనదాన్నిగా చేసుకునేందుకు ఎలాంటి ఐడియాలు వేశాడన్నదే సినిమా. స్టోరీ నార్మల్ గానే ఉన్నా.. డైరెక్టర్ పవన్ సాదినేని టేకింగ్ మాత్రం చాలా బాగుందనే టాక్ వినిపి్సోతంది. విజువల్స్ పరంగా బాగుండడం, 'సావిత్రి పెళ్లి - మా ఇంటి పరువు ఒకటే' లాంటి డైలాగ్స్ ఆకట్టుకోవడం ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. ఏప్రిల్ 1న సావిత్రి వెండితెరపై సందడి చేయనుంది.
Tags:    

Similar News