'అఖిల్‌' హీరోయిన్‌ తల్లి అయ్యింది

Update: 2021-07-24 04:21 GMT
అక్కినేని అఖిల్‌ మొదటి సినిమాతో హీరోయిన్ గా సాయేషా సైగల్‌ పరిచయం అయిన విషయం తెల్సిందే. నటిగా టాలీవుడ్‌ లో ఆమె మంచి గుర్తింపు దక్కించుకోలేక పోయింది. అయితే తమిళంలో వరుసగా ఆఫర్లు రావడంతో అక్కడ బిజీ అయ్యింది. ఆర్యతో సినిమా చేస్తున్న సమయంలో ఆయనతో ప్రేమలో పడింది.

ఇద్దరి మద్య వయసు వ్యత్యాసం చాలా ఎక్కువ అయినా కూడా వారి ప్రేమను పెద్దలు ఒప్పుకున్నారు. కొన్నాళ్ల క్రితం వీరి ప్రేమ పెళ్లి పీఠల వరకు వెళ్లింది. ఆర్య మరియు సాయేషా ల జోడీకి కోలీవుడ్‌ వర్గాల్లో మంచి టాక్ ఉంది. ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉంటారు అనే టాక్ ఉంది. ఇప్పుడు ఈ జోడీకి ప్రమోషన్‌ దక్కింది.

కొద్ది సేపటి క్రితం సాయేషా పాపాయికి జన్మనిచ్చింది. ఆ విషయాన్ని తమిళ మీడియా వర్గాల వారు కన్ఫర్మ్‌ చేశారు. ఇండస్ట్రీకి చెందిన కొందరు కూడా అధికారికంగా స్పందించారు. ఆర్యకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్స్ చేస్తున్నారు. ఆర్య ఇటీవలే సార్పట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ తమిళ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఒక వైపు ఆర్య ఆ ఆనందంలో ఉండగానే మరో వైపు సాయేషా పాపాయికి జన్మనివ్వడంతో ఆర్య సంతోషం డబుల్‌ అయ్యింది.

నటుడిగా ఆర్య ఎప్పటికప్పుడు తనను తాను నిరూపించుకుంటూ విలక్షణ నటుడిగా గుర్తింపు దక్కించుకుంటున్నాడు. హీరోగానే కాకుండా విలన్ గా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా ఆర్య నటించి మెప్పించాడు. ఇక పెళ్లి తర్వాత కూడా సాయేషా కొన్ని సినిమాల్లో నటించింది. ఇటీవల ఆమె గర్బం దాల్చడం వల్ల సినిమాలకు దూరం అయ్యింది. మళ్లీ పాప కాస్త పెద్దగా అయిన తర్వాత రీ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

ఆర్య మరియు సాయేషా దంపతులకు పాపకు జన్మనిచ్చిన సందర్బంగా నెటిజన్స్ పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తున్నారు. మా తరపున కూడా ఈ స్టార్‌ కపుల్‌ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Tags:    

Similar News