కొన్నాళ్ల క్రితం వరకు పెళ్లి అయితే హీరోయిన్స్ సినీ కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉండేది, ఒకవేళ నటించాలని వారికి ఆసక్తి ఉన్నా కూడా దర్శక నిర్మాతలు పెళ్లి అయిన హీరోయిన్స్ పై ఆసక్తి చూపించే వారు కాదు. కాని ప్రస్తుతం పరిస్థితి మారింది. బాలీవుడ్ లో మొదలైన ఈ మార్పు మెల్ల మెల్లగా సౌత్ సినీ ఇండస్ట్రీలో కూడా కనిపిస్తోంది. పెళ్లి తర్వాత గ్యాప్ తీసుకున్న ఐశ్వర్య రాయ్ రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇంకా కరీనా కపూర్ తో పాటు పలువురు హీరోయిన్స్ పెళ్లి తర్వాత కూడా ఇండస్ట్రీలో హాటీలుగా కొనసాగుతున్నారు.
సౌత్ లో మాత్రం మొన్న మొన్నటి వరకు కూడా పెళ్లి తర్వాత హీరోయిన్స్ సినిమాలు మానేయాల్సిన పరిస్థితి. మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకున్న కొందరు హీరోయిన్స్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విషయం తెల్సిందే. వారి భర్తల వల్ల లేదంటే కుటుంబ పరిస్థితుల వల్ల సినిమాలకు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. మహేష్ ను చేసుకున్న తర్వాత నమ్రత, నాగార్జునను చేసుకున్న తర్వాత అమల, సూర్యను చేసుకున్న తర్వాత జ్యోతిక, అజిత్ ను చేసుకున్న తర్వాత షాలినిలు సినిమాలకు గుడ్ బై చెప్పారు. పెళ్లి సమయంలో వారు మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్స్. కాని పెళ్లి తర్వాత వారు పూర్తిగా సినిమాలకు దూరం అయ్యారు.
ఇక పెళ్లి తర్వాత సినిమాలకు నో చెప్పడంతో అమలా పాల్ విడాకులు ఇవ్వగా, త్రిష పెళ్లికి ముందే క్యాన్సిల్ చేసుకుంది. పెళ్లి అయిన తర్వాత తన భార్య హీరోయిన్ గా చేయవద్దనే ఆలోచనలో సౌత్ హీరోలు ఇప్పటి వరకు ఉన్నారు. కాని మెల్ల మెల్లగా ఆ పద్దతి మారుతోంది. ఇటీవలే వివాహం చేసుకున్న హీరోయిన్ సాయేషా ఈ విషయంలో లక్కీ అని చెప్పుకోవాలి. ఆర్యను ప్రేమ వివాహం చేసుకున్న సాయేషాకు సినిమాలకు ఎలాంటి అడ్డు చెప్పనంటూ ఆర్య హామీ ఇచ్చాడట. పెళ్లి తర్వాత కూడా ఆమె పూర్తి స్వేచ్చగా ఉంటోంది. ఆమె సోషల్ మీడియా పోస్ట్ లు మరియు సినిమాల్లో ఎంపిక చేసుకునే పాత్రలు, వేసుకునే కాస్ట్యూమ్స్ అన్ని కూడా ఆమె గతంలో మాదిరిగానే ఉంటుందట. అందుకే సాయేషా లక్కీ అంటున్నారు.