పారితోషికంలో వ‌ర‌ల్డ్ నం.1 హీరోయిన్

Update: 2019-11-22 19:26 GMT
ఆ న‌టిని చూస్తేనే ఫ్యాన్స్ ఉర్రూత‌లూగిపోతారు. తాను ఓ సినిమాలో న‌టిస్తోంది అంటే దానికి క‌చ్ఛితంగా అవార్డులు రివార్డులు ద‌క్కాల్సిందే. ప్ర‌పంచంలోనే నంబ‌ర్ వ‌న్ పారితోషికం అందుకునే క‌థానాయిక‌గా పాపుల‌ర్. ప్ర‌ఖ్యాత‌ ఫోర్బ్స్ ధ‌న‌వంతుల జాబితాలోనూ టాప్ పొజిష‌న్ లో కొన‌సాగుతోంది. ఇంత‌కీ ఈ ఫేమ‌స్ స్టార్ ఎవ‌రు అంటే చెప్పాల్సిన ప‌నేలేదు.

`అవెంజ‌ర్స్` ఫేం స్కార్లెట్ జాన్స‌న్.. మార్వ‌ల్ సినిమాల్లో క్వీన్ ఆఫ్ పెర్ఫామ‌ర్ గా ఐడెంటిటీ ఉన్న స్టార్. 1994లో `నార్త్` అనే చిత్రంతో 10ఏళ్ల వ‌య‌సులోనే న‌ట‌న‌లో అడుగు పెట్టిన స్కార్లెట్ అంచెలంచెలుగా ఎదిగిన తీరు అన‌న్య సామాన్యం. 2018 లో వ‌ర‌ల్డ్ హైయ‌స్ట్ పెయిడ్ యాక్ట్రెస్ గా పాపులరైంది. 22 న‌వంబ‌ర్ 2019తో త‌న వ‌య‌సు 35. ఇంత చిన్న‌ వ‌య‌సులో తాను అందుకోని శిఖ‌రం లేదు. నేడు (న‌వంబ‌ర్ 22) స్కార్లెట్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా అశేషంగా ఉన్న అభిమానులు త‌న‌కు శుభాకాంక్ష‌లు చెప్పారు. అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ ఫ్యాన్స్ అంతా స్కార్లెట్ కోసం గూగుల్ లో సెర్చు చేశారు.

స్కార్లెట్ ప్ర‌ఖ్యాత‌ అమెరిక‌న్ న‌టి కం సింగ‌ర్. కెన‌డియ‌న్ అమెరిక‌న్ న‌టుడు.. నిర్మాత‌ రేయాన్ రెనాల్డ్స్ కి భార్య‌. ఒక చిన్నారికి త‌ల్లి కూడా. త‌ను న‌టించిన `బ్లాక్ విడో` 1 మే 2020లో రిలీజ్ కానుంది. ఇక స్కార్లెట్ న‌టించిన చిత్రాల్లో చాలా వాటికి అవార్డులు రివార్డులు ద‌క్కాయి. స్కార్లెట్ గ‌త ఏడాది న‌టించిన‌ `మ్యారేజ్ స్టోరి` చిత్రం 2019 ఆస్కార్ రేసులోనూ నామినేష‌న్స్ లో నిలిచి ప్ర‌త్య‌ర్థి సినిమాల‌కు గ‌ట్టి పోటీనే ఇచ్చింది. లాస్ట్ ఇన్ ట్రాన్స్ లేష‌న్ (2003) చిత్రానికి ప్ర‌తిష్ఠాత్మ‌క బాఫ్టా అవార్డును అందుకుంది స్కార్లెట్. ఇదే చిత్రానికి గాను గోల్డెన్ గ్లోబ్స్ ఉత్త‌మ క‌థానాయిక అవార్డుకు నామినేట్ అయ్యింది. గ‌ర్ల్ విత్ ఏ పెర్ల్ ఇయ‌ర్ రింగ్ (2003) అనే చిత్రానికి బాఫ్టా అవార్డ్ తో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు ద‌క్కాయి. 2014లో వ‌చ్చిన లూసీ చిత్రానికి ఉత్త‌మ న‌టిగా నేష‌న‌ల్ సొసైటీ ఫిలిం క్రిటిక్స్ అవార్డ్ ద‌క్కింది. 2005 లో మ్యాచ్ పాయింట్ అనే చిత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ అయ్యింది. ఈ చిత్రంలో న‌ట‌న‌కు గాను.. చికాగో ఫిలిం క్రిటిక్స్ అసోసియేష‌న్ ఉత్త‌మ న‌టిగా స్కార్లెట్ ని ఎంపిక చేసింది. స్కార్లెట్ న‌టించిన ప‌లు చిత్రాలు ఆస్కార్ నామినేష‌న్ల‌కు వెళ్లాయి.
Tags:    

Similar News