త్వరలో రెండో సినిమా ప్రకటిస్తా: యాంకర్ ప్రదీప్

Update: 2021-01-29 17:30 GMT
టీవీ యాంకర్ గా కెరీర్ ప్రారంభించి సినిమా హీరోగా అరంగేట్రం చేసాడు పాపులర్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు. పదేళ్లకు పైగా టీవీలో యాంకర్ గా ఎన్నో స్టేజి షోలకు , రియాలిటీ కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఇన్నేళ్ల తర్వాత ప్రదీప్ సినిమా హీరోగా మారాడు. తాజాగా '30రోజులలో ప్రేమించడం ఎలా?' అనే సినిమా చేసాడు ప్రదీప్.

సినిమా ఫలితం గురించి పక్కన పెడితే ప్రదీప్ హీరోగా మారేసరికి ఇండస్ట్రీలో చాలామంది అతనికి విషెస్ తెలియజేసారు. తాజాగా ప్రదీప్ సెకండ్ మూవీ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. అతను హీరోగా నటించిన సినిమా విడుదల అయిందో లేదో అప్పుడే సెకండ్ సినిమా వార్త వచ్చేసరికి ఇండస్ట్రీలో ఆ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ప్రదీప్ మాములుగా ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అందిస్తాడో అందిరికి తెలుసు. అయితే హీరోగా ఎలా అలరిస్తాడనే విషయం ఎవరికి సరిగ్గా తెలియదు.

జనవరి 29న అంటే ఈరోజు ప్రదీప్ నటించిన ఫస్ట్ మూవీ '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' విడుదలైంది. ఈ సందర్బంగా ప్రదీప్ తన సెకండ్ మూవీ గురించి ప్రస్తావించాడు. ఆయన మాట్లాడుతూ.. "నా మొదటి సినిమా '30రోజుల్లో ప్రేమించడం ఎలా'లో నటించేటప్పుడు చాలా ఎంజాయ్ చేసాను. ఇప్పటికి ఆ సినిమా ప్రభావం పోలేదు. మొదటి సినిమాలోనే రెండు వెరియేషన్స్ చూపించే పాత్ర లభించడం ఆనందంగా ఉంది. ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డాం.

ముందుగా గడ్డం లేకుండా కాలేజీ సన్నివేశాలు పూర్తిచేసాం. ఆ తర్వాత మూడు నెలలపాటు గడ్డం జుట్టు పెంచి మళ్లీ రెండో పాత్రతో కేరళలో షూటింగ్ జరిపాము. అయితే త్వరలోనే నా రెండో సినిమా గురించి ప్రకటిస్తాను. ప్రస్తుతం మొదటి సినిమా ఫలితం ఎంజాయ్ చేస్తున్నాం" అని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. 30రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాతో తమిళ యాక్ట్రెస్ అమృత అయ్యర్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది.
Tags:    

Similar News