పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన `రాధేశ్యామ్` రిలీజ్ కి కౌంట్ డైన్ స్టార్ట్ అయింది. రిలీజ్ కి ఇంకా ఐదు రోజులే గడువుంది. దీంతో ప్రచారం పీక్స్ కి చేరింది. కొద్ది రోజులుగా ప్రభాస్..పూజాహెగ్డే టీమ్ సభ్యులంతా ప్రచారం పనుల్లో నిమగ్నమయ్యారు. ముంబై నుంచి హైదరాబాద్ వరకూ ప్రచారం ఠారెత్తిపోతుంది. బాలీవుడ్ మీడియాకి ప్రత్యేక ఇంటర్వ్యూలు..స్పెషల్ అట్రాక్షన్ తో రాధేశ్యామ్ ని వీలైనంత పబ్లిసిటీ కల్పిస్తున్నారు.
ఈ వారం లోనే సినిమాకి బోలెడంత పబ్లిసిటీ లభించింది. ఆ సంగతి పక్కనబెట్టి సినిమా కంటెంట్ పరంగాను ఇప్పుడు హైలైట్ అవుతోంది. మొదట్లో కాస్త నెగివిటీ స్ర్పెడ్ అయినప్పటికీ సెకెండ్ ట్రైలర్ తో సినిమా ఊపు తీసుకొచ్చింది. డిఫరెంట్ జానర్ సినిమా అనే థాట్ నుంచి డీవియేట్ అవుతున్నారంతా. తొలుత రిలీజ్ అయిన పస్ట్ లుక్ పోస్టర్లు సినిమాకి మంచి బజ్ తీసుకొచ్చి నప్పటికీ..తొలి ట్రైలరే కాస్త నిరుత్సాహ పరిచింది. తాజాగా రిలీజ్ అయిన సెకెండ్ ట్రైలర్‌తో అన్ని సెట్ అయినట్లే కనిపిస్తోంది.
సినిమాకి అన్ని వైపులా పాజిటివ్ సైన్ కనిపిస్తోంది. ప్రభాస్ మాస్ హీరో ఇమేజ్ కొంత వరకూ `రాధేశ్యామ్` పై ప్రభావం చూపిన మాట వాస్తవం. ఇప్పటివరకూ ప్రభాస్ ఇలాంటి అటెంప్స్ట్ చేయకపోవడం...అతనికి ఉన్న మాస్ ఫాలోయింగ్ వంటి అంశాలు కొంత వరకూ నెగిటివ్ సైన్ వైపు తీసుకెళ్లాయి. `సాహో` భారీ సక్సెస్ కాకపోయినా యాక్షన్ కంటెంట్ పరంగా బాగానే ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. హిందీ బెల్డ్ లో ఆ సినిమా మంచి వసూళ్లు సాధించింది.
ఈ నేపథ్యంలో `రాధేశ్యామ్` లో అలాంటి యాక్షన్ మిస్ అవుతుందా? అన్న సంకేతాలు తెరపైకి వచ్చినప్పటికీ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ ఏమాత్రం తగ్గలేదని తాజా ప్రచారంలో భాగంగా హైలైట్ చేయడం కొంత వరకూ కలిసొచ్చింది.
ప్రభాస్ -పూజా హెగ్డే ల మధ్య లిప్ లాక్ సన్నివేశాలు..ఇంటిమేట్ సీన్స్ ని మరింత హైలైట్ చేయడం సినిమాపై బజ్ ని..క్యూరియాసిటీని రెట్టింపు చేస్తున్నాయి. ఈ పీరియాడిక్ లవ్ స్టోరీలో ఇటలీ అందాలు.. ప్రత్యేక సెట్లు..విజువల్ ట్రీట్ స్పెషల్ గా హైలైట్ అవుతుందని ఇప్పటికే ప్రాచుర్యంలో ఉన్న సంగతి తెలిసిందే.
ఇటీవల రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోలు కూడా ప్రేక్షకాభిమానుల్ని ఆకట్టుకున్నాయి. సినిమా రన్ టైమ్ కూడా క్రిస్పీగా ఉంది. సెన్సార్ నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. మరి వాటిని అందుకోవడంలో `రాధేశ్యామ్` ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి. ఈచిత్రానికి `జిల్` ఫేం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది.