#వ‌కీల్ సాబ్.. అమెరికాలో దెబ్బ కొట్టిన సెకండ్ వేవ్

Update: 2021-04-18 05:48 GMT
అమెరికా నుంచి మ‌న స్టార్ హీరోల సినిమాలు 3.5 మిలియ‌న్ డాల‌ర్ల‌ క‌లెక్ష‌న్లు సాధించ‌డం అన్న‌ది ఒక సంచ‌ల‌నం. దాదాపు 20కోట్ల వసూళ్లు నాన్ బాహుబ‌లి సినిమాల ఖాతాలో ప‌డుతుంటే అంతా ఆశ్చ‌ర్య‌పోయి మ‌రో నైజాంగా మారింద‌ని సంతోషించారు.

కానీ గ‌త ఏడాది కాలంగా క‌రోనా మ‌హ‌మ్మారీ రంగ ప్ర‌వేశం అన్నిటినీ మార్చేసింది. ఇండియాతో పోలిస్తే క‌రోనా వల్ల అమెరికా మార్కెట్లు మ‌రీ దారుణంగా ప‌డిపోయాయి. ఇప్పుడు సెకండ్ వేవ్ ప్ర‌భావం అమెరికాని విడిచిపెట్ట‌డం లేదు. దీంతో తెలుగు సినిమా మార్కెట్ ప్ర‌మాదంలో ప‌డింది.
 
పవన్ కళ్యాణ్ న‌టించిన‌ కోర్ట్ రూమ్ రూమ్ డ్రామా వకీల్ సాబ్ అమెరిక‌లో భారీ నష్టాలను చ‌వి చూస్తోంద‌ని చెబుతున్నారు. శుక్రవారం వరకు ఈ చిత్రం మొత్తం  730K డాల‌ర్లు వసూలు చేయగలిగింది. ఈ చిత్రం తన US కొనుగోలుదారులను సురక్షితమైన జోన్ లోకి తీసుకురావడానికి 1.4 మిలియ‌న్ డాల‌ర్లు పైగా వసూలు చేయాలి. కానీ ప్రస్తుత స‌న్నివేశంలో ఒక మిలియ‌న్ డాల‌ర్ (1000కె డాల‌ర్) వ‌సూలు చేయ‌డ‌మే గ‌గ‌నంగా మారింది. అజ్ఞాత‌వాసి లాంటి డిజాస్ట‌ర్ చిత్రం అమెరికాలో దాని ప్రీమియర్ల నుండి 1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అప్ప‌టికి క‌రోనా భ‌యాలు లేవు. కానీ ఇప్పుడు క‌రోనా భ‌యాల న‌డుమ అమెరికాలో వ‌కీల్ సాబ్ వ‌సూళ్లు నిరాశ‌ప‌రిచాయి.
Tags:    

Similar News