ఇండియన్ బాక్సాఫీస్ పై అవతార్ 2 విజృంభించడానికి సిద్ధమైంది. అవతార్ 1 తోనే ఇక్కడ ఎన్నో రికార్డులు సృష్టించిన ఈ మూవీ ఇప్పుడు ఆ సినిమా సెకండ్ పార్ట్ తో సత్తా చాటాలని చూస్తుంది. డిసెంబర్ 16న వరల్డ్ వైడ్ గా భారీ రేంజ్ లో రిలీజ్ అవుతున్న ఈ మూవీకి అన్నిచోట్ల భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
అంతేకాదు ఈ సినిమాకు పోటీగా వస్తే డేంజర్ అనుకుని మరే సినిమా రిలీజ్ చేయట్లేదు. డిసెంబర్ 16 కి ముందు వారం అంటే డిసెంబర్ 9న దాదాపు 17 సినిమాల దాకా రిలీజ్ అవుతున్నాయి. ఇక నెక్స్ట్ వీక్ మాత్రం శాసనసభ, పసివాడి ప్రాణం సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతున్నాయి.
ఇండియన్ మార్కెట్ ముఖ్యంగా టాలీవుడ్ పై అవతార్ 2 ప్రభావం భారీగానే ఉండబోతుంది. జేమ్స్ కామెరూన్ మీద ఉన్న నమ్మకం వెండితెర మీద అవతార్ 2 మరో అద్భుతాన్ని సృష్టిస్తుందని ఫిక్స్ అయ్యారు. అందుకే డిసెంబర్ సెకండ్ వీక్ ని ఆ మూవీ కోసం వదిలి పెట్టారు. ఇక 10 రోజుల ముందే టికెట్స్ ఓపెన్ కాగా రిలీజ్ దగ్గర పడుతున్న టైం లో టికెట్స్ సేల్ పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ ఏరియాలో అవతార్ 2 భారీ రేంజ్ లో రిలీజ్ అవుతుంది. అందుకే నెక్స్ట్ వీక్ సిటీ మొత్తం అవతార్ 2 షోలతోనే నిండిపోతుంది.
రీసెంట్ గా వచ్చిన హిట్ 2 ఎలాగు అప్పటికల్లా ఫుల్ రన్ పూర్తి చేసుకుంటుంది. ఇక ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఏ సినిమా కూడా వారం కంటే ఎక్కువ థియేటర్ లో ఉండే ఛాన్స్ కనిపించడం లేదు. కాబట్టి డిసెంబర్ 16న వస్తున్న అవతార్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనాలు సృష్టించే ఛాన్స్ ఉంది. అవతార్ 2 తో పాటుగా మీడియం రేంజ్ హీరోల సినిమాలు వస్తే నిలబడే ఛాన్స్ ఉండేది. ఎందుకంటే అవతార్ 2 అందరు చూసే సినిమా ఏమి కాదు ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ఈ సినిమాని ఇష్టపడకపోవచ్చు. మరి అలాంటి వారి కోసమైనా అవతార్ 2 డేట్ న మన హీరోలు ఏదైనా సినిమా వదిలితే బాగుండేది.
డిసెంబర్ చివరి వారం అంటే 23న నిఖిల్ 18 పేజెస్, రవితేజ ధమాకా రిలీజ్ చేస్తున్నారు. ఆ రెండు సినిమాల్లో ఏ ఒక్కటైనా అవతార్ 2 కి పోటీగా రిలీజ్ చేసినా వర్క్ అవుట్ అయ్యేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మరి సింగిల్ గా వస్తున్న అవతార్ 2 ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ లో చూపిస్తుంది అన్నది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.