'పుష్ప' అనే బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్న అల్లు అర్జున్.. వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఓ తమిళ రీమేక్ చిత్రంలో బన్నీ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారని.. అది కూడా ఓ దేవుడి పాత్ర అని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. తమిళ్ లో సూపర్ హిట్ అయిన 'ఓ మై కడవులే' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు తెలుగులో ఆ పాత్ర కోసం మేకర్స్ అల్లు అర్జున్ ని సంప్రదిస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇదే కనుక నిజమైతే బన్నీ ని మోడ్రన్ గాడ్ గా చూసే అవకాశం దక్కుతుంది. ఎందుకంటే 'ఓ మై కడవులే చిత్రంలో విజయ్ సేతుపతి పోషించింది దేవుడి పాత్ర. మరి ఇప్పుడు తెలుగులో ఆ పాత్రలో నటించడానికి వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న అల్లు అర్జున్ అంగీకరిస్తారో లేదో చూడాలి. బన్నీ గతంలో గుణశేఖర్ ‘రుద్రమదేవి’ చిత్రంలో గోన గన్నారెడ్డి అనే అతిథి పాత్రలో నటించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా, అశోక్ సెల్వన్ - రితికా సింగ్ జంటగా తెరకెక్కిన 'ఓ మై కడవులే' తెలుగు రీమేక్ లో విశ్వక్ సేన్ - మిథిలా పాల్కర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పీవీపీ సినిమాస్ మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పీవీపీ - దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఒరిజినల్ వెర్సన్ ని డైరెక్ట్ చేసిన అశ్వత్ మారిముత్తు తెలుగు రీమేక్ కి కూడా దర్శకత్వం వహిస్తారు. 'పెళ్లి చూపులు' డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారని సమాచారం. ఈ మూవీకి సంబంధించిన ఇతర వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.