జాతిరత్నాలు చూడండి చాలు.. కోవిడ్ వ్యాక్సిన్ అవసరం లేదు! అని చాలామంది కితాబిచ్చారని అన్నారు హాస్యనటుడు ప్రియదర్శి. నవీన్ పోలిశెట్టి-రాహుల్ రామకృష్ణ- ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నాగ్ అశ్విన్ నిర్మించిన తాజా చిత్రం జాతిరత్నాలు తెలుగు రాష్ట్రాల్లో 10కోట్ల వసూళ్లను సాధించి అమెరికాలో ఒక మిలియన్ డాలర్ క్లబ్ వైపు దూసుకెళుతోంది.
ఈ సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ ప్రియదర్శి పైవిధంగా స్పందించారు. నా స్నేహితుడు రాహుల్ కథ విని నాకు చెప్పారు. ఆ తర్వాత దర్శకుడు అనుదీప్ కథను నా పాత్రను వినిపించారు. నేను కథ కథనం వినేప్పుడు తుదికంటా నవ్వుతూనే ఉన్నాను. ప్రేక్షకులకు శేఖర్ గా నేను నచ్చాను. నా పాత్రను అభినందించారు. వరుస ఫోన్ కాల్స్ సందేశాలతో నా ఫోన్ నిండిపోయింది. జాతి రత్నాలు సినిమాకి వెళితే సరిపోతుందని .. COVID వ్యాక్సిన్ అవసరం లేదని చాలా మంది నాకు చెప్తున్నారు`` అని అన్నారు.
అయితే వారు తమాషా చేశారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను అని ప్రియదర్శి అన్నారు. ప్రస్తుతం ఓ రెండు సినిమాలు చేస్తున్న ప్రియదర్శి వెబ్-సిరీస్ లలో నటిస్తున్నానని తెలిపారు. ఎస్వీఆర్.. కోట శ్రీనివాసరావు తనకు స్ఫూర్తి అని ప్రియదర్శి అన్నారు.