చిత్రం : సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు
నటీనటులు: రాజ్ తరుణ్ - ఆర్తన - షకలక శంకర్ - రాజా రవీంద్ర - ఆదర్శ్ బాలకృష్ణ - నవీన్ - శంకర్ - సురేఖావాణి - శ్రీలక్ష్మి - అనంత్ తదితరులు
సంగీతం: గోపీసుందర్
ఛాయాగ్రహణం: విశ్వ
మాటలు: శ్రీనివాస్ గవిరెడ్డి - అనిల్ మల్లెల
నిర్మాతలు: శైలేంద్రబాబు - కెవీ శ్రీధర్ రెడ్డి - హరీష్ దుగ్గిశెట్టి
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: శ్రీనివాస్ గవిరెడ్డి
టాలీవుడ్ లోకి సైలెంటుగా వచ్చేసి... చాలా తక్కువ టైంలో చడీచప్పుడు లేకుండా మూడు హిట్లు కొట్టేశాడు రాజ్ తరుణ్. ఇప్పుడతడి మూడో సినిమా ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ మీద కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఆ అంచనాల్ని అందుకుందా.. రాజ్ డబుల్ హ్యాట్రిక్ కు శ్రీకారం చుట్టిందా.. చూద్దాం పదండి.
కథ:
రామచంద్రాపురం అనే పల్లెటూల్లో ఏ బాధ్యతా లేకుండా స్నేహితులతో కలిసి అల్లరి చిల్లరిగా తిరిగేస్తున్న శ్రీరామ్ (రాజ్ తరుణ్)కు ఎదురింటి సీతామాలక్ష్మి (ఆర్తన) అంటే చిన్నప్పట్నుంచి ప్రాణం. ఇంటర్ కూడా పాస్ కాని శ్రీరామ్.. ఎంబీబీఎస్ చదివే సీతామాలక్ష్మి కూడా తనను ప్రేమిస్తోందనుకుని పొరబడి ఆమెకు తన ప్రేమను చెబుతాడు. ఆమె అతణ్ని ఛీకొడుతుంది. ఐతే శ్రీరామ్ తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకుని తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. ఐతే సీతామాలక్ష్మి తండ్రి ఆమెకు వేరే పెళ్లి నిశ్చయిస్తాడు. ఆ సమయంలో శ్రీరామ్ ఏం చేసి తన ప్రేయసిని దక్కించుకున్నాడన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
ఓ సన్నివేశంలో హీరోయిన్ వచ్చి హీరో ఒళ్లో వాలిపోవడానికి షకలక శంకర్ ఓ ఐడియా చెబుతాడు. పక్కనున్న ఫ్రెండు ఇది చాలా సినిమాల్లో చూసిన సన్నివేశమే కదా.. వర్కవుటవుతుందా అని అడుగుతాడు. దానికి షకలక శంకర్.. ‘‘అది వర్కవుటయ్యే ఐడియా కాబట్టే అన్ని సినిమాల్లో వాడారు’’ అని సెలవిస్తాడు. ‘సీతమ్మ అందాలు రామయ్యా సిత్రాలు’ సినిమా ఏంటో ఈ ఒక్క డైలాగ్ తో చెప్పేయొచ్చు.
అనగనగా ఓ పల్లెటూరు. అందులో ఫ్రెండ్సుతో కలిసి బేవార్సుగా తిరిగేసే హీరో. చదువుల తల్లి లాంటి హీరోయిన్. ఆమె అంటే అతడికి ప్రాణం. ముందు అతణ్ని ఛీకొట్టిన హీరోయిన్ తర్వాత అతడి ప్రేమను గుర్తించి ఫ్లాట్ అయిపోతుంది. ఇంతలో హీరోయిన్ తండ్రి అడ్డం పడి వేరే పెళ్లి చేయబోతాడు. హీరో ఎంట్రీ ఇచ్చి తన మావ సెట్ చేసిన వాడితో పందెం కాస్తాడు. చివరికి పందెం గెలిచి హీరోయిన్ని సొంతం చేసుకుంటాడు. ఈ ఫార్ములాతో ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్కల్లో చెప్పడం కష్టం. ‘కొత్త’ దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి కూడా ఈ ‘పాత’ ఫార్ములానే ఎంచుకున్నాడు. ఈ పాత కథలోకి కొత్త హీరో రాజ్ తరుణ్ వచ్చి చేరాడు. అంతే తేడా.
సినిమా మొదలైనప్పట్నుంచి ముగిసే వరకు ప్రతి సన్నివేశం కూడా ఎక్కడో చూసినట్లే ఉంటుంది. దర్శకుడు చాలా సినిమాల్ని మిక్సీలో వేసి.. తన వంటకం తయారు చేసుకున్నాడు. అందులోనూ పల్లెటూరి నేపథ్యం.. ఓ ఆట నేపథ్యంలో సినిమా కాబట్టి ఎంత వద్దనుకున్నా చాలాసార్లు ‘కబడ్డీ కబడ్డీ’ సినిమా గుర్తుకొస్తుంది. అందులో కోళ్లు పట్టేవాడిని కబడ్డీ జట్టులోకి ఎంపిక చేసినట్లు.. రూపాయి బిళ్ల ఎగరేస్తే క్యాచ్ పట్టుకునే బిచ్చగాణ్ని క్రికెట్ జట్టులోకి తీసుకుంటారు. ఇలా ఎన్ని పోలికలు కనిపిస్తాయో లెక్కేలేదు.
ప్రేక్షకుడి అంచనాల నుంచి ఏమాత్రం పక్కకు వెళ్లకుండా చాలా రొటీన్ గా కథాకథనాల్ని నడిపించిన దర్శకుడు.. ఈ కాలం యూత్ కు బాగా కనెక్టయ్యే కామెడీ అందించే ప్రయత్నమైతే బాగానే చేశాడు. హీరోతో దెబ్బలు తింటూ పంచ్ డైలాగులు వేసే పాత్రలో షకలక శంకర్ ను బాగా వాడుకున్నాడు. క్యారెక్టర్లు, సన్నివేశాలు రొటీన్ అనిపించినా.. శంకర్ అండ్ కో అందించే వినోదం ప్రేక్షకులకు బాగానే కాలక్షేపం చేస్తుంది.
ఇక సినిమా చివర్లో క్రికెట్ మ్యాచ్ కూడా యూత్ కు కనెక్టయ్యే అవకాశముంది. క్రికెట్ నాలెడ్జ్ బాగా ఉన్న దర్శకుడు కుర్రాళ్లు ఎంజాయ్ చేసేలా దానికి సంబంధించిన సన్నివేశాల్ని చిత్రీకరించాడు. ఐతే ఆ మ్యాచ్ ఎపిసోడ్ కూడా చాలా రొటీన్ గా ఓ ఫార్మాట్ ప్రకారం సాగిపోతుంది. ముందు హీరో టీం చేతులెత్తేయడం.. బ్రేక్ లో వచ్చి కోచ్ వాళ్లను ఇన్ స్పైర్ చేయడం.. ఆ తర్వాత అందరూ చెలరేగిపోవడం.. చివర్లో టెన్షన్ బిల్డప్ చేయడం.. హీరో దెబ్బ తాకినా పోరాడటం.. ఇలా అంతా ఓ ఫార్మాట్ ప్రకారం సాగిపోతుంది.
మిగతా వ్యవహారాలు ఎలా ఉన్నా కనీసం హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని ఆసక్తికరంగా తీర్చిదిద్దడంలోనూ
విఫలమయ్యాడు. ఆ ప్రేమలో ఎక్కడా ఫీల్ లేదు. హీరో నిప్పుల మీద నడవగానే హీరోయిన్ ఫ్లాటైపోవడం మరీ సినిమాటిక్ గా ఉంది.
నటీనటులు:
ఈ రొటీన్ విలేజ్ లవ్ స్టోరీ రాజ్ తరుణ్ వల్ల కొంచెం ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. అదే సమయంలో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వెళ్తున్న రాజ్.. ఇలాంటి సినిమాను ఎందుకు ఎంచుకున్నాడో అన్న సందేహం కూడా కలుగుతుంది. సినిమాలో ఎమోషన్ లేదు కానీ.. రాజ్ మాత్రం ఎమోషనల్ సీన్స్ లో బాగా చేశాడు. మిగతా సన్నివేశాల్లో హుషారుగా నటించాడు. కొత్తమ్మాయి ఆర్తన పెద్దగా ఆకట్టుకోదు. కొన్నిసార్లు అందంగా కనిపిస్తుంది కానీ.. ఓవరాల్ గా ఆమె హీరోయిన్ అన్న ఫీలింగ్ కలగదు. ఆమెను చూస్తే హీరోకు కలిగినంత ఫీలింగ్ ప్రేక్షకులకు కలగకపోవచ్చు. నటన కూడా గొప్పగా ఏమీ లేదు. మిగతా నటీనటుల్లో షకలక శంకర్ బాగా ఆకట్టుకుంటాడు. తనదైన శైలిలో పంచ్ డైలాగులతో నవ్వించాడు. రాజారవీంద్ర బాగా చేశాడు. హీరో ఫ్రెండ్స్ బ్యాచ్ లో అందరూ ఓకే. ఆదర్శ్ తనకు అలవాటైన పాత్రనే చేశాడు. హీరో తండ్రిగా చేసిన డైరెక్టర్ శంకర్ మామూలుగా అనిపిస్తాడు. మిగతా వాళ్లంతా మామూలే.
సాంకేతికవర్గం:
టెక్నీషియన్స్ దర్శకుడికి బాగానే సపోర్ట్ చేశారు. దర్శకుడు తన పాటల్ని ఎలా వాడుకున్నాడు అన్నది పక్కనబెడితే రెండు మూడు మంచి మెలోడీలు అందించాడు గోపీసుందర్. నేపథ్య సంగీతం మాత్రం చాలాచోట్ల అవసరానికి మించి హుషారుగా ఉంది. పెద్ద మాస్ హీరో సినిమాలకు వాయించినట్లు వాయించేశాడు గోపీ. విశ్వ సినిమా నేటివిటీకి సూటయ్యే ఛాయాగ్రహణం అందించాడు. పాటల చిత్రీకరణ బాగుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు. దర్శకుడే అనిల్ అనే రచయితతో కలిసి అందించిన మాటల్లో అనుకరణ.. ప్రాస కోసం ప్రయాస బాగా ఎక్కువైంది. ‘‘మీకు కిందా పైనా గార్డ్ లు అవసరమేమో.. కానీ మాకు ఆ క్రికెట్ గాడ్ సచిన్ చాలు’’ అంటూ ఓ డైలాగ్ ఉంది ఇందులో. ఈ పోలికలేంటో.. ఈ డైలాగులో ఔచిత్యమేంటో దర్శకుడే చెప్పాలి. కొన్ని డైలాగులైతే బాగానే పేలాయి. దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి ఏదోలా రెండు గంటలు బాగానే టైంపాస్ చేయించగలిగాడు కానీ.. ఓ కొత్త దర్శకుడి నుంచి ఆశించే వైవిధ్యమేమీ అతను చూపించలేకపోయాడు. పాత సినిమాలపై మరీ ఎక్కువగా ఆధారపడి.. దర్శకుడిగా తన ముద్రేమీ చూపించలేకపోయాడు.
చివరగా: సిత్రాలేం లేవు.. పాత ‘చిత్రాలు’ తప్ప!
రేటింగ్: 2.5/5
Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre