`సీటీమార్` మొద‌టి రోజు స‌న్నివేశం..!

Update: 2021-09-11 09:30 GMT
మ్యాచో స్టార్ గోపీచంద్-మిల్కీబ్యూటీ త‌మ‌న్నా జంట‌గా న‌టించిన `సీటీమార్` ఈ శుక్ర‌వారం థియేట‌ర్లో రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. కొన్ని నెల‌ల త‌ర్వాత స్టార్ హీరో సినిమా థియేట‌ర్ల‌లోకి రావ‌డం ఇదే తొలిసారి. రిస్క్ చేసి మ‌రీ గోపీచంద్ థియ‌ట‌ర్లోకి వ‌చ్చారు. దీంతో ఎలాంటి ఫ‌లితాలు వ‌స్తాయా? అని హీరో.. ద‌ర్శ‌క నిర్మాత‌లు టెన్ష‌న్ ప‌డ్డారు. కానీ అంద‌రి అంచ‌నాల్ని తారుమారు చేస్తూ  సీటీమార్ ఫ‌ర్వాలేద‌నిపించే టాక్ తో న‌డుస్తోంది. తొలి రోజు బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. గోపీచంద్ కెరీర్ లో మొద‌టిరోజు మంచి క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా  చెబుతున్నారు.

డే వ‌న్ షేర్ 3.5 కోట్లపైగానే తెచ్చిందిట‌. నైజాంలో 90 ల‌క్ష‌ల షేరు వ‌చ్చిన‌ట్లు  ట్రేడ్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఉత్త‌రాంధ్రాలో 29 ల‌క్ష‌లు.. నెల్లూరు లో 19 ల‌క్ష‌లు షేర్ వ‌సూల్ చేసిన‌ట్లు స‌మాచారం. క్రైసిస్ కొన‌సాగుతున్నా జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం.. తొలిరోజే ఈ స్థాయిలో వ‌సూళ్లు రావ‌డం..సినిమాకు పాజిటివ్  టాక్ రావ‌డంతో  వీకెండ్ అయిన శ‌ని..ఆదివారాల్లో మ‌రింత పుంజుకునే అవ‌కాశం ఉందని ట్రేడ్ వ‌ర్గాలు  అంచ‌నా వేస్తున్నాయి. అంతా పాజిటివ్ గా ఉంటే భారీ వ‌సూళ్ల దిశ‌గా సీటీమార్ దూసుకెళుతుంద‌ని అంచ‌నా. ప్రస్తుతం మార్కెట్ లో ఆ సినిమాకు మ‌రో సినిమా పోటీ కూడా లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుద‌లైన ఒకే ఒక్క స్టార్ హీరో సినిమా కూడా ఇదే. ఈ నేప‌థ్యంలో ప్రేక్ష‌కులు థియేట‌ర్ కు వెళ్లే అవ‌కాశం క‌నిపిస్తుంది.

సెకెండ్ వేవ్ ఇంకా ఉంద‌ని ప్ర‌భుత్వం చెబుతున్నా కేసులు సంఖ్య బాగా త‌గ్గింది. ప‌బ్లిక్ స్థ‌లాల్లో ప్ర‌జ‌లు తిర‌గ‌డం కూడా పెరిగింది. మ‌ళ్లీ పార్కులు.. హోట‌ళ్లు.. బీచ్ లో జ‌నాల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. కాబ‌ట్టి సీటీమార్ కు ఇవ‌న్నీ క‌లిసొచ్చే అంశాలే. సీటీమార్ ఇదే  స్పీడ్ ని మ‌రో నాలుగైదు  రోజుల పాటు కొన‌సాగిస్తే గోపీచంద్ కెరీర్ లోనే భారీ వ‌సూళ్ల చిత్రంగా నిలిచే అవ‌కాశం ఉంది. భారీ యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన ఈ చిత్రానికి  సంపత్ నంది ద‌ర్శ‌కత్వం వ‌హించారు. శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించింది.
Tags:    

Similar News