చిత్రం : ‘సీటీమార్’
నటీనటులు: గోపీచంద్-తమన్నా-భూమిక-రెహమాన్-తరుణ్ అరోరా-దిగంగన సూర్యవంశీ-రావు రమేష్-పోసాని కృష్ణమురళి తదితరులు
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: సౌందర్ రాజన్
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
రచన-దర్శకత్వం: సంపత్ నంది
కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత తెలుగులో విడుదలవుతున్న పెద్ద సినిమా అంటే.. ‘సీటీమార్’యే. గోపీచంద్ హీరోగా ఇంతకుముందు ‘గౌతమ్ నంద’ తీసిన సంపత్ నంది ఆ చిత్రాన్ని రూపొందించాడు. కబడ్డీ నేపథ్యంలో కమర్షియల్ అంశాల కలబోతతో తెరకెక్కిన ‘సీటీమార్’ ఈ రోజే మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ అంచనాలను సినిమా ఏమేర అందుకుందో చూద్దాం పదండి.
కథ:
కార్తీక్ (గోపీచంద్) ఒక కబడ్డీ కోచ్. తన తండ్రి తమ ఊరిలో నెలకొల్పిన పాఠశాల ప్రైవేటు పరం కాబోతుండటంతో దాన్ని కాపాడుకోవడం కోసం తమ ఊరికి చెందిన అమ్మాయిలతో కబడ్డీ జట్టును సిద్ధం చేసి వారికి శిక్షణ ఇస్తాడు కార్తీక్. వాళ్లంతా జాతీయ స్థాయిలో సత్తా చాటితే తమ ఊరికి పేరొస్తుందని.. తమ బాధను అందరూ వింటారని.. అప్పుడు తమ పాఠశాలను కాపాడుకోవచ్చని కార్తీక్ బావిస్తాడు. అనుకున్నట్లే జట్టును జాతీయ కబడ్డీ ఛాంపియన్ షిప్ కు తీసుకెళ్తాడు. అక్కడ చక్కటి ప్రదర్శనతో జట్టు దూసుకెళ్తున్న సమయంలో.. అందులోని అమ్మాయిలంతా ఒకేసారి కిడ్నాప్ అవుతారు. మరి ఈ కిడ్నాప్ చేసిందెవరు.. వారిని కార్తీక్ కాపాడాడా.. వారితో ఫైనల్ ఆడించి జట్టును విజేతగా నిలిపాడా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
క్రీడల నేపథ్యంలో ఫుల్ లెంగ్త్ సినిమాలు తెలుగులో చాలా తక్కువే. హిందీలో స్పోర్ట్స్ డ్రామాలు చాలా పకడ్బందీగా తెరకెక్కుతుంటాయి. అవి చాలా రియలిస్టిగ్గా కూడా ఉంటాయి. తెలుగులో ‘జెర్సీ’ లాంటి ఒకటీ అరా మాత్రమే అథెంటిక్ స్పోర్ట్స్ డ్రామాలు కనిపిస్తాయి. ఇప్పటిదాకా చాలా వరకు మాస్ మసాలా సినిమాలే తీసిన సంపత్ నంది కబడ్డీ నేపథ్యంలో సినిమా అనగానే ఒకింత ఆశ్చర్యం కలిగింది. ఐతే అతను ‘జెర్సీ’ లాంటి రియలిస్టిక్ స్పోర్ట్స్ మూవీ తీస్తాడన్న అంచనాలైతే లేవు. ‘సీటీమార్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో సంపత్ మాట్లాడుతూ.. తమ చిత్రం చక్ దె ఇండియా.. దంగల్ తరహాలో ఏమీ ఉండదని.. ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని కూడా సంకేతాలివ్వడంతో ప్రేక్షకులకు ఎలాంటి సినిమా చూడబోతున్నామో ఒక అంచనా వచ్చేసింది. ఐతే ఒక ఆట నేపథ్యంలో కథ రాసుకున్నపుడు ‘సై’లో మాదిరి ఉత్కంఠ రేకెత్తిస్తూనే కమర్షియల్ అంశాలు జోడించి ఎంటర్టైన్ చేయడానికి అవకాశముంది. కానీ ‘సీటీమార్’ ఈ అవకాశాన్ని పెద్దగా ఉపయోగించుకోలేదు. ఆట పరంగా ఏ ఎగ్జైట్మెంట్ ఇవ్వనపుడు ఆ బ్యాక్ డ్రాప్ తీసుకోవాల్సిన అవసరమే కనిపించదు. ‘సీటీమార్’ చూస్తున్నంతసేపూ ఇదే భావన కలుగుతుంది. కబడ్డీ నేపథ్యంలో సినిమా అన్నమాటే కానీ.. ఆట పరంగా ఈ సినిమా అందించే వినోదం... పంచే ఉత్కంఠ ఏమీ లేదు. అమ్మాయిలను ఆటల్లో ప్రోత్సహించాలి.. వాళ్లు గెలవాలి అంటూ స్పీచులివ్వడానికి.. డైలాగ్స్ పేల్చడానికి మినహాయిస్తే కథలో ‘ఆట’కు దక్కిన ప్రాధాన్యం తక్కువే. కబడ్డీని పక్కన పెట్టి చూస్తే ఇదొక రొటీన్ మాస్ మసాలా మూవీ. కమర్షియల్ హంగులకు లోటు లేని ఈ చిత్రం టార్గెటెడ్ ఆడియన్స్ కు ఓకే అనిపిస్తుంది.
క్రీడా నేపథ్యంలో ఏ సినిమా చూసినా.. విజయానికి-ఒక లక్ష్యానికి ముడి పెట్టడం గమనించవచ్చు. ‘సీటీమార్’లోనూ అంతే. స్ట్రెంత్ తగ్గిపోయి మూత దిశగా వెళ్తున్న పాఠశాలను కాపాడుకోవడం కోసం ఆ ఊరి అమ్మాయిలను కబడ్డీ ఛాంపియన్లను చేయాలని కోచ్ లక్ష్యంగా పెట్టుకుంటాడు. ‘సై’లో.. ‘గోల్కొండ హైస్కూల్’లో గ్రౌండును కాపాడుకోవడం కోసం అందులోని క్రీడాకారులు పోటీకి సై అన్నట్లు.. ఇక్కడ స్కూల్ కోసం ఒక టీం కదనరంగంలోకి అడుగు పెడుతుందన్నమాట. ఐతే ఈ లక్ష్యం విషయంలో పై రెండు సినిమాల్లో మాదిరి ఎమోషనల్ కనెక్ట్ తీసుకురావడంలో సంపత్ నంది విఫలమయ్యాడు. స్కూల్ చుట్టూ నడిచే డ్రామా అంతా ఒక ప్రహసనం లాగా అనిపిస్తుంది తప్ప.. ప్రేక్షకులను కదిలించేలా లేదు. ఇక అమ్మాయిలకు ఆటలెందుకని ఊర్లో అందరూ నిరుత్సాహపరచడం.. వాళ్లకు హీరో హితబోధ చేయడం.. ముందు వెనక్కి తగ్గిన తల్లిదండ్రులు ప్రయాణ సమయానికి కోచ్ వెంట అమ్మాయిల్ని పంపించడం.. ఇలా ఒక రొటీన్ తంతులాగా నడుస్తుంది వ్యవహారమంతా. కథ ఢిల్లీకి షిఫ్ట్ అయ్యాక అక్కడ కబడ్డీ నేషనల్స్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు కొంచెం హుషారుగా ఉంటాయి. తమన్నా రాకతో జోష్ వస్తుంది. హీరో టీం జట్టు ఈజీగా ఫైనల్ చేరిపోవడంతో డ్రామా ఏమీ లేదేంటి అనిపిస్తుంది. ఐతే ఇంటర్వెల్ ముంగిట.. టీం మెంబర్స్ కిడ్నాప్ తో కథ మలుపు తిరుగుతుంది.
ఇక ద్వితీయార్ధమంతా హీరో.. ఆ అమ్మాయిలు ఏమయ్యారని కనిపెట్టడం.. వాళ్లను కాపాడి ఫైనల్ కోసం తిరిగి తీసుకురావడం మీద నడుస్తుంది. హీరో-అతడి బావ మీద కక్షతో విలన్ ఈ అమ్మాయిలను కిడ్నాప్ చేయడం.. 48 గంటల గడువిచ్చి మీ బావను నీ చేతులతో చంపి ఈ అమ్మాయిలను కాపాడుకోమనడం.. ఈ సవాలు ఆసక్తికరంగా అనిపిస్తుంది. 48 గంటల డెడ్ లైన్ నేపథ్యంలో కథ ఉత్కంఠభరితంగా నడుస్తుందని అంచనా వేస్తాం. కానీ సాదాసీదా కథనం.. సన్నివేశాలతో ద్వితీయార్ధాన్ని సంపత్ నంది తేల్చేశాడు. విషయం ఇంత సీరియస్ అయినపుడు.. మధ్య మధ్యలో జ్వాలా రెడ్డి లాంటి మాస్ పాట.. పెప్సీ ఆంటీ లాంటి ఐటెం సాంగ్ ప్లేస్ చేశారంటే కథనం ఏమాత్రం ఆసక్తికరంగా.. ఉత్కంఠభరితంగా సాగి ఉంటుందో అంచనా వేయొచ్చు. విలన్-హీరో బావకు సంబంధించిన ట్రాక్ అయితే మరీ పేలవం. హీరో-విలన్ మధ్య ఎత్తులు పైఎత్తులు ఏమాత్రం ఆసక్తికరంగా అనిపించవు. కిడ్నాప్ అయిన అమ్మాయిలను హీరో కనిపెట్టడానికి హీరో చేసే ప్రయత్నాలు చాలా సాదాసీదాగా ఉంటాయి. చివరికి ఏం జరుగుతుందనే విషయంలో ప్రేక్షకుల అంచనాలేమీ తప్పవు. చివర్లో కూడా గేమ్ ను పెద్దగా ఉపయోగించుకున్నది లేదు. ఐతే క్లైమాక్స్ ఫైట్ మాత్రం మాస్ మెచ్చేలా భారీగా చిత్రీకరించారు. సినిమా మొత్తంలో కూడా సంపత్ నంది మాస్ ప్రేక్షకులు కోరుకునే హంగులు జోడించడానికే చూశాడు తప్ప.. పకడ్బందీగా కథాకథనాలు తీర్చిదిద్దుకోలేదు. చివరికి చూస్తే ఈ సినిమాకు కబడ్డీ నేపథ్యం ఎందుకనే ప్రశ్న తలెత్తుతుంది. ఒక రొటీన్ మాస్ మసాలా మూవీ చూడాలనుకుంటే ‘సీటీమార్’ ఓకే కానీ.. అంతకుమించి ఆశిస్తే కష్టమే.
నటీనటులు:
గోపీచంద్ తన నుంచి అభిమానులు కోరుకునే మాస్ పాత్రలో కనిపించాడు. అతడి పెర్ఫామెన్స్ కొత్తగా అనిపించదు కానీ.. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎప్పట్లాగే గోపీ యాక్షన్ ఘట్టాల్లో అదరగొట్టాడు. తమన్నా కూడా గోపీ లాగే కోచ్ పాత్ర చేసింది కానీ.. ఆమె పాత్ర.. నటనలో ఏ ప్రత్యేకతా లేదు. గ్లామర్ పరంగా తమన్నా ఆకట్టుకుంటుంది. జ్వాలా రెడ్డి పాటలో ఆమె బాగా హైలైట్ అయింది. విలన్ పాత్రలో తరుణ్ అరోరా పెర్ఫామెన్స్ చాలా రొటీన్ గా అనిపిస్తుంది. రెహమాన్.. భూమిక ఓకే అనిపించారు. దిగంగన సూర్యవంశీ గురించి చెప్పడానికేమీ లేదు. కబడ్డీ క్రీడాకారిణులుగా చేసిన అమ్మాయిల్లో ప్రీతి అస్రాని ఆకట్టుకుంటుంది. పోసాని.. రావు రమేష్ ఓకే అనిపించారు.
సాంకేతిక వర్గం:
మాస్ సినిమాలకు తనదైన శైలిలో సంగీతాన్నందించే మణిశర్మ.. రెండు పాటల వరకు ఓకే అనిపించాడు. సీటీమార్.. జ్వాలారెడ్డి పాటలు మంచి ఊపుతో సాగుతాయి. ఐతే నేపథ్య సంగీతంలో మణిశర్మ తన స్థాయికి తగ్గ ఔట్ పుట్ ఇవ్వలేదు. యాక్షన్ ఘట్టాలు.. ఎలివేషన్ సీన్లు కాకుండా మిగతా చోటంతా ఆర్ఆర్ సాధారణంగా అనిపిస్తుంది. సౌందర్ రాజన్ ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. ఒక మాస్ సినిమాలో ఉండాల్సిన భారీతనం కనిపించేలా రిచ్ గానే తీశారు. రచయిత-దర్శకుడు సంపత్ నంది.. క్రీడా నేపథ్యంలో కథ రాసుకున్నాడు కానీ.. గేమ్ పరంగా ఎగ్జైట్మెంట్ కలిగేలా సినిమా తీయలేదు. ఆ నేపథ్యం ఎంచుకోవడం వరకు ఓకే కానీ.. దాని లోతుల్లోకి వెళ్లలేదు. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో ఉత్కంఠ రేకెత్తించేలా కథనాన్ని తీర్చిదిద్దుకోలేదు. ‘గౌతమ్ నంద’తో ఏదో కొత్తగా ట్రై చేసిన అతను.. ఈసారి కమర్షియల్ గా సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నం చేశాడు. రచయితగా అతడికి యావరేజ్ మార్కులు పడతాయి. ఓ మాస్ సినిమాను డీల్ చేయడంలో దర్శకుడిగా ఓకే అనిపించాడు.
చివరగా: సీటీమార్.. ఓన్లీ మాస్-గేమ్ మిస్
రేటింగ్-2.75/5