'సెహరి' ట్రైలర్: పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అక్కతో ప్రేమలో పడితే..!

Update: 2022-02-02 07:21 GMT
హర్ష కనుమల్లి - సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా రూపొందిన యూత్‌ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ "సెహరి''. హీరో హర్ష కనుమల్లి ఈ చిత్రానికి కథ అందించగా.. జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా పాటలు - టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. ఫిబ్రవరి 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేసారు.

ట్రైలర్ లోకి వెళ్తే.. ఫ్రెండ్స్ తో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్న వరుణ్ (హర్ష కనుమల్లి).. తన సోల్ మేట్ కోసం వెతుకుతూ కనిపించాడు. ఇక్కడ సమస్య ఏమిటంటే, అతను కలిసే అమ్మాయిలందరినీ తన సోల్ మేట్ గా భావిస్తున్నాడు. కానీ అతని అమాయకత్వం కారణంగా వారు అతనితో విడిపోతున్నారు. ఇలా కొందరితో తిరస్కరణలు ఎదుర్కొని చివరకు ఒక అమ్మాయితో ఏడడుగులు నడవాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలో తన ప్రపంచాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న  సిమ్రాన్ చౌదరితో పరిచయం ఏర్పడటం.. ఆమెని ఇష్టపడటం మొదలు పెట్టాడు.

అయితే కథలో ట్విస్ట్ ఏమిటంటే, సిమ్రాన్ చౌదరి తనకు కాబోయే భార్యకు అక్క.. అతని కంటే నాలుగేళ్లు పెద్దది. ఈ విషయం తెలుసుకున్న అతని స్నేహితులు మరియు తండ్రి కోటి అది తప్పని వారించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరుణ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు జరిగాయి.. అతని లవ్ లైఫ్ కు ఎలా ఎండ్ కార్డ్ పడిందనేది తెలియాలంటే 'సెహరి' సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. మొత్తం మీద గా ట్రైలర్ మంచి ఇంప్రెషన్ తెచ్చి సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ట్రైలర్ ని బట్టి జ్ఞానసాగర్ ద్వారక అన్ని వర్గాలకు సంబంధించిన ఎలిమెంట్స్‌ తో ఆసక్తికర స్క్రీన్‌ ప్లేతో పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌ గా రూపొందించినప్పటికీ.. యూత్‌ ని ఎక్కువగా ఆకట్టుకునే కథను ఎంచుకున్నారని తెలుస్తుంది. హర్ష్ కనుమిల్లి తన అమాయకమైన నటనతో ఆకట్టుకున్నాడు. సిమ్రాన్ చౌదరికి కూడా ఇందులో మంచి పాత్ర లభించింది. ఇందులో హర్ష తండ్రిగా ప్రముఖ సంగీత దర్శకుడు కోటి కనిపించగా.. అభినవ్ గోమతం అతని స్నేహితుడిగా నవ్వించే పాత్రను పోషించాడు.

నందు ప్రత్యేక పాత్రలో కనిపించగా.. ప్రణీత్ రెడ్డి - అనిషా అల్లా - అక్షిత హరీష్ - బాలకృష్ణ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. అరవింద్ విశ్వనాథ్ సినిమాటోగ్రఫీ చెప్పుకోదగ్గది ఉంది. ప్రశాంత్ ఆర్ విహారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. రవితేజ గిరజాల ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేయగా.. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. విర్గో పిక్చర్స్ బ్యానర్ పై అద్వయ జిష్ణు రెడ్డి - శిల్పా చౌదరి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. వాలెంటైన్స్ వీక్ లో రాబోతున్న 'సెహరి' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Full View
Tags:    

Similar News