సైబర్ క్రైమ్ లో బాధితుడైన కమ్ముల

Update: 2018-06-27 07:48 GMT
ఈమధ్య కాలంలో బయట జరిగే అరాచకాలు చాలవన్నట్టు సైబర్ క్రైమ్స్ మిన్నంటేస్తున్నాయి. అలాంటి ఒక క్రైమ్ లో టాలీవుడ్ పాపులర్ దర్శకుడు బలయ్యాడు. ఆయన ఎవరోకాదు శేఖర్ కమ్ముల. ఈ మధ్యనే ఒక సైబర్ క్రైమ్ కి బాధితుడయ్యాడు ఈ ఫిదా దర్శకుడు.

ఒక గుర్తుతెలియని వ్యక్తి తాను శేఖర్ కమ్ముల అసిస్టెంట్ ని అని చెప్తూ ఒక వెబ్సైట్ తెరిచి, అందులో ఒక సినిమాకోసం కొందరు ఫ్రెష్ యాక్టర్లు కావాలని యాడ్ ఇచ్చాడు. అంతే కాదండోయ్. ఫోటోలు మాత్రమే కాక ఫీ రూపంగా 1500 నుండి 1800 పంపాలని కూడా కండిషన్ పెట్టాడు. అది మరీ అంత ఎక్కువ అమౌంట్ కాదు కాబట్టి పెద్దగా ఎవరికి అనుమానాలు కలగలేదు. ఈ తతంగం ఒక 25 రోజులు సాగింది, చాలామందే డబ్బులు పంపడం జరిగింది.

కాకపోతే ఒకరికి మాత్రం ఎక్కడో తేడాగా అనిపించి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో  ఈ వార్త బయటకి వచ్చింది. విషయం తెలిసిన శేఖర్ కమ్ముల షాకయ్యాడట. మరికొందరు డబ్బులు కట్టిన వాళ్లు, శేఖర్ కమ్ముల పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వారు రంగంలోకి దిగి నిందితుడిని వెతకడం ప్రారంభించారు. తక్కువ డబ్బులే అయినప్పటికీ, కొంచెం ముందు వెనక ఆలోచించి కట్టాలి కదా.. మీరేమంటారు?

ఇక సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతం శేఖర్ కమ్ముల ఒక కథను తయారుచేసుకుని.. అల్లు అర్జున్ కు వినిపించినట్లు టాక్ వస్తోంది. అయితే స్టయిలిష్‌ స్టార్ కాకపోయినా కూడా మెగా క్యాంపులో ఎవరైనా ఒక హీరోతో సినిమా చేయాలని చూస్తున్నాడట ఈ దర్శకుడు. లెటజ్ సీ ఏమవుతుందో!!
Tags:    

Similar News