క్లాసిక్స్ కాకపోయినా క్లాస్ స్టోరీలతో తనకంటూ ఒక ముద్రను క్రియేట్ చేసుకుని యువతరాన్ని ఉర్రుతలూగించిన దర్శకుడు శేఖర్ కమ్ముల. అయితే తన గత రెండు సినిమాలు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ - అనామిక ఫ్లాప్ అవ్వడంతో ఉనికిని కోల్పోయాడు.
చాలా కాలం విరామం తరువాత వరుణ్ తేజ్ - సాయి పల్లవిల జోడితో ఒక ప్రేమకధకు సిద్ధమయ్యాడు. అయితే శేఖర్ కమ్ముల చాలా స్లో గా సినిమాని తెరకెక్కిస్తాడనే ప్రధాన విమర్శనుండి బయటకు రావడానికి ఈ సినిమాతో ప్రయత్నిస్తున్నాడు. అనామికతో ఈ ముద్రను చెరిపేయాలని చూసినా అది అరువు స్టోరీ కాబట్టి అంతగా పట్టించుకోలేదు.
ఇప్పుడు ఈ యువ ప్రేమకధను ఎట్టి పరిస్థితులలో అనుకున్న సమయానికి పూర్తిచెయ్యాలనే తపనతో వున్నట్టు తెలుస్తుంది. అందుకోసం ఇప్పటికే స్టోరీ డిస్కషన్లు - స్టోరీ బోర్డు - ఏకంగా లైట్ సెట్టింగ్స్ వరకూ పక్కాగా పేపర్ వర్క్ పూర్తిచేసినట్టు సమాచారం. చూద్దాం ఈసారన్నా అతని వేగం అతనిలో మార్పు తెస్తుందేమో