'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' 'అనామిక' వంటి సినిమాలతో భారీగా డిజప్పాయింట్ చేసిన శేఖర్ కమ్ముల.. ఎట్టకేలకు తన కొత్త సినిమాను మొదలెడుతున్నాడు. ఈ సినిమాను మెగా హీరో వరుణ్ తేజ్ తో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాతో మనోడు వరుణ్ తేజ్ కెరియర్ ను ఎటు మలుపు తిప్పుతాడనేదే మెగా డౌట్.
గతంలో ఆనంద్ - గోదావరి వంటి సినిమాలు తిసినప్పుడు.. వాటిలో హీరోకంటే ఎక్కువగా హీరోయిన్ కే పేరొచ్చింది. దెబ్బకి కమిలినీ ముఖర్జీ ఇక్కడ బిజీ అయ్యి కూర్చుంది. ఆ తరువాత శేఖర్ తీసిన హ్యాపీ డేస్ కథే వేరు. అందులో కాలేజే హీరో. యాక్టర్లందరూ కేవలం పాత్రదారులే. లీడర్ ఒక్కటే బెస్టు సబ్జెక్ట్ అనుకుంటే.. ఆ సినిమా ఆడలేదు. మరి ఇప్పుడు శేఖర్ తీయబోతున్న మెగా సినిమా.. ఎలా ఉండబోతోంది? యూత్ ఫుల్ లవ్ స్టోరీనా లేకపోతే ఏదన్నా ఫిమేల్ ఓరియెంటడ్ సబ్జెక్ట్ లో హీరో ఒక భాగమా అనే సందేహం రాక మానదు.
అయితే శేఖర్ మాత్రం.. ఈసారి తన పందా మార్చుతున్నాడని తెలుస్తోంది. ఎప్పటిలాగా క్లాసులు పీకడం.. చిన్న చిన్న ఎమోషన్లతో పెద్ద పెద్ద సీన్లు రాయడం వంటివి కాకుండా.. ఇప్పుడు ఒక మాంచి ఫ్యామిలీ కథనే అందిస్తున్నాడని చెబుతున్నారు. లెటజ్ సీ.