చిత్రం : ‘సెల్ఫీ రాజా’
నటీనటులు: అల్లరి నరేష్ - కామ్న- సాక్షి చౌదరి - సప్తగిరి - తాగుబోతు రమేష్ - పృథ్వీ - నాగినీడు - రవిబాబు - కృష్ణభగవాన్ - శ్రీలక్ష్మి తదితరులు
సంగీతం: సాయికార్తీక్
ఛాయాగ్రహణం: లోక్ నాథ్
నిర్మాత: రామబ్రహ్మం చౌదరి
స్క్రీన్ ప్లే - దర్శకత్వ: ఈశ్వర్ రెడ్డి
‘సుడిగాడు’ తర్వాత సక్సెస్ రుచే చూడలేదు అల్లరి నరేష్. గత నాలుగేళ్లలో దాదాపు పది సినిమాలు చేశాడు కానీ.. ఏదీ ఫలితాన్నివ్వలేదు. దీంతో ఈసారి కొంచెం ఎక్కువ గ్యాప్ తీసుకుని ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’ ఫేమ్ ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ‘సెల్ఫీ రాజా’ సినిమా చేశాడు. నరేష్ గత సినిమాలతో పోలిస్తే దీని మీద జనాలకు కొంచెం ఆసక్తి నెలకొంది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అయినా అల్లరోడి రాతను మార్చేలా ఉందో లేదో చూద్దాం పదండి.
కథ:
సెల్ఫీలంటే పడి చచ్చే రాజా (అల్లరి నరేష్) తన పేరునే ‘సెల్ఫీ రాజా’గా మార్చుకుంటాడు. అతడికి నోటి దురద కూడా బాగా ఎక్కువ. కమిషనర్ కూతురైన శ్వేత (కామ్న) అనే అమ్మాయికి కొన్ని అబద్ధాలు చెప్పి దగ్గరవుతాడు రాజా. ఆమెతో అతడికి పెళ్లి కూడా జరుగుతుంది. కానీ రాజాకు వేరే అమ్మాయిలతో సంబంధాలున్నాయని అపార్థం చేసుకుని ఆమె అతడికి దూరమవుతుంది. ఆ సమయంలో రాజాకు జీవితం మీద విరక్తి పుట్టి చచ్చిపోవాలనుకుంటాడు. తనను చంపమని ఓ రౌడీకి కాంట్రాక్టు ఇస్తాడు. ఐతే ఇంతలోనే శ్వేత రాజా గురించి నిజం తెలుసుకుని అతడికి దగ్గరవుతుంది. కానీ రాజాను చంపడానికి కాంట్రాక్టు తీసకున్న రౌడీ మాత్రం అతణ్ని చంపడం కోసం తిరుగుతుంటాడు. రాజా వేరే శత్రువులు కూడా అతడి కోసం గాలిస్తుంటారు. వీళ్లందరి నుంచి రాజా తనను తాను ఎలా కాపాడుకున్నాడన్నది మిగతా కథ
కథనం - విశ్లేషణ:
వరుస ఫ్లాపుల దెబ్బకు తనలో చాలా మార్పు వచ్చేసిందని.. తన తప్పులేంటో తాను తెలుసుకున్నానని.. ‘సెల్ఫీ రాజా’ చూస్తే ఆ సంగతి అర్థమవుతుందని చెప్పాడు అల్లరి నరేష్. కానీ ఈ సినిమా చూస్తుంటే నరేష్ ఇంతగా మారిపోయాడేంటి అనిపిస్తుంది. ఇంతకుముందు అతడి సినిమాల్లో అంతో ఇంతో కథుండేది. కాస్తో కూస్తో కొత్తదనం కోసమైనా ప్రయత్నించేవాడు. కానీ ‘సెల్ఫీరాజా’లో ఆ మాత్రం లేకకపోయింది. అర్థం లేని కథ.. తలా తోకా లేకుండా సాగిపోయే కథనం.. జబర్దస్త్ లాంటి కామెడీ షోల స్ఫూర్తితో అల్లుకున్న చీప్ కామెడీ సీన్స్.. అల్లరి నరేష్ సినిమాల్లో ఎప్పుడూ కనిపించే పేరడీలు.. స్పూఫులు.. వీటన్నింటి మిశ్రమమే ‘సెల్ఫీరాజా’.
ఒక వ్యక్తి చనిపోవాలనుకుంటే మార్గాలే ఉండవా..? ఎంత కామెడీ సినిమా అయినా కానీ.. లాజిక్కులతో సంబంధం లేకుండా కామెడీ పండించాలని చూసినా.. మరీ తనను చంపడానికి హీరో ఓ రౌడీకి కాంట్రాక్టు ఇవ్వడం.. అవతలున్న రౌడీ ఒక్కసారి కమిటయ్యాక వెనక్కి తగ్గేది లేదంటూ.. కాంట్రాక్టు ఇచ్చిన హీరో మనసు మార్చుకుని వద్దొద్దు చంపొద్దన్నా వినకుండా అతడి వెంట పడటం.. ఏం విడ్డూరమో? ఇంకా కామెడీ ఏంటంటే.. తాను చచ్చే మార్గం తెలియక విలవిలలాడుతున్న కథానాయకుడు.. ఎవరో రౌడీ తన భూమిని కబ్జా చేస్తే వాళ్లను చంపేస్తాడని తెలుసుకుని అతడి ల్యాండ్ కబ్జా చేస్తాడట. అతనొచ్చి హీరోను చంపే ప్రయత్నంలో తనే చనిపోతాడట. ఆ తర్వాత అతడి పెళ్లాలు హీరో మీద పగబట్టి హీరో వెంటపడతారట. ‘సెల్ఫీరాజా’లో ఇలాంటి పాత్రలకు.. ఇలాంటి విడ్డూరాలకు కొదవే లేదు.
ఆరంభంలో కథానాయకుడి పాత్రకు ఇచ్చిన ఇంట్రడక్షన్ చూసి.. అల్లరోడు ఈసారి కొంచెం భిన్నంగా ఏదో ట్రై చేసినట్లున్నాడు.. కొంచెం నవ్వించేలాగే ఉన్నాడని భ్రమపడతాం. ఐతే హీరో సెల్ఫీ పిచ్చి గురించి.. అతడి నోటి దూల గురించి ఇంట్రడక్షన్ ఇస్తూ పండించే కామెడీ.. ఆ తర్వాత వచ్చే రెండు మూడు సన్నివేశాలు మినహాయిస్తే.. సినిమాలో ఏదీ ఎంగేజింగ్ గా అనిపించదు. ఊరికే సినిమాకు టైటిల్ గా పెట్టుకోవడానికి.. జనాల్ని ఆకర్షించడానికి మాత్రమే ఈ సెల్ఫీ కాన్సెప్ట్ పెట్టారని.. మిగతాదంతా ఎప్పట్లాగే రొటీన్ ‘అల్లరి’ వ్యవహారమని తెలియడానికి ఎంతో సమయం పట్టదు. నరేష్ సినిమాల్లో ఎప్పుడూ కనిపించే పేరడీలు... స్పూఫులతోనే సినిమాను చాలా వరకు నింపేశారు. సినిమాలో ప్రతి సన్నివేశమూ అనుకరణే. ఎక్కడా కూడా కాస్తయినా కొత్తదనం లేకుండా జాగ్రత్తపడ్డారు రచయిత-దర్శకుడు.
ఎప్పుడో వచ్చిన ‘అర్జున్’ సినిమా నుంచి.. నిన్నగాక మొన్న వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ వరకు లెక్కలేనన్ని పేరడీలు ట్రై చేశాడు నరేష్. అల్లరోడిని ఇలాంటి పాత్రల్లో ఎన్నిసార్లని చూస్తాం. ఒక టికెట్ మీద వంద సినిమాలంటూ ‘సుడిగాడు’ చూపించినపుడే డోస్ ఎక్కువైపోయింది. ఆ తర్వాత సినిమాలన్నీ మొహం మొత్తేస్తున్నాయన్న సంగతి వాటిని తిప్పి కొడుతున్న ప్రతిసారీ అర్థమవుతూనే ఉన్నా.. అల్లరి నరేష్ మళ్లీ అలాంటివే ట్రై చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ పేరడీలు.. స్పూఫులు సరిపోవన్నట్లు జబర్దస్త్ ఆర్టిస్టుల్ని తీసుకొచ్చి.. స్కిట్లు కూడా చేయించారు సినిమాలో. అవీ చాలవన్నట్లు వాట్సాప్ లో ఫార్వర్డ్ అయ్యే జోకుల్ని కూడా దట్టించారు. ప్రథమార్ధమైనా అంతో ఇంతో పర్వాలేదనిపిస్తుంది కానీ.. ద్వితీయార్ధం మాత్రం భరించలేని విధంగా తయారైంది. ద్వితీయార్ధంలో వచ్చే ‘పాము’ కామెడీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈ ఎపిసోడ్ చూశాక కూడా చివరిదాకా కూర్చోగలిగితే గొప్ప విషయమే.
నటీనటులు:
అల్లరి నరేష్ ఎప్పుడూ చేసే స్పూఫులు పేరడీలే ఇందులోనూ చేశాడు. డ్యూయల్ రోల్ చేశాడు కానీ.. రెంటికీ పెద్దగా తేడా కనిపించదు. నటన పరంగా కొత్తదనం ఏమీ లేదు. హీరోయిన్ల గురించి మాట్లాడ్డానికేమీ లేదు. కొత్తమ్మాయి కామ్న ఒకట్రెండు చోట్ల పర్వాలేనిపించే హావభావాలిచ్చింది. అందం విషయంలో పెద్దగా ఆకట్టుకోలేదు. సాక్షి చౌదరి ఉన్నానంటే ఉన్నాననిపించింది. పృథ్వీ బాలయ్యను అనుకరిస్తూ ఒకట్రెండు చోట్ల నవ్వించే ప్రయత్నం చేశాడు. సప్తగిరి.. తాగుబోతు రమేష్ కూడా తమకు అలవాటైన రీతిలో ఏదో ట్రై చేశాడు. మిగతా వాళ్లంతా మామూలే.
సాంకేతికవర్గం:
కథాకథనాల్ని బట్టే టెక్నీషియన్స్ పని తీరు కూడా ఉంటుంది. ఇన్ స్పైర్ చేసే అంశాలేమీ లేనపుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు..? ఏదో మొక్కుబడిగా పని కానిచ్చేయడం తప్ప. సాయికార్తీక్ సంగీతం.. లోక్ నాథ్ ఛాయాగ్రహణం కూడా అలాగే ఉన్నాయి. ఒకట్రెండు పాటలు పర్వాలేదనిపిస్తాయి. మాటలన్నీ కూడా చాలా వరకు అనుకరణ లాగా అనిపిస్తాయి. కథ గురించి కానీ.. కథనం గురించి కానీ చెప్పడానికేమీ లేదు. ఇక ‘సిద్ధు ఫ్రం శ్రీకాకుళం’ సినిమాతో పర్వాలేదనిపించిన దర్శకుడు ఈశ్వర్ రెడ్డి.. ఇంత వేగంగా ఈ స్థాయికి పడిపోయాడేంటి అనిపించాడు ‘సెల్ఫీ రాజా’తో. కొన్ని సన్నివేశాల్లో అతడి సెన్సాఫ్ హ్యూమర్ కనిపిస్తుంది కానీ.. లాజిక్ అంటూ లేకుండా సాగిపోయే కథాకథనాల మధ్య అవేమీ ఎలివేట్ కాలేదు. దర్శకుడిగా ఈశ్వర్ పూర్తిగా నిరాశ పరిచాడు.
చివరగా: ‘సెల్ఫీ రాజా’తో పెట్టుకుంటే బ్యాండ్ బాజానే.
రేటింగ్ - 1.5/5
Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre