టాలీవుడ్లో ‘రంగులరాట్నం’ పేరుతో ఒక సినిమా మొదలైన సంగతి కూడా జనాలకు తెలియదు. కానీ చడీచప్పుడు లేకుండా ఈ సినిమాను పూర్తి చేసేసి నేరుగా థియేట్రికల్ ట్రైలర్ తో దిగిపోయింది చిత్ర బృందం. అక్కినేని నాగార్జున నిర్మాణంలో రాజ్ తరుణ్-చిత్ర శుక్లా హీరో హీరోయిన్లుగా శ్రీ రంజని అనే కొత్త దర్శకురాలు ఈ చిత్రాన్ని రూపొందించింది. నిన్న సాయంత్రం రిలీజైన ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించింది. సంక్రాంతికి పెద్ద సినిమాలతో పోటీ పడబోతున్న ఈ చిత్రం స్లీపర్ హిట్టయినా ఆశ్చర్యం లేదేమో. ఫలితం సంగతలా ఉంచితే.. నాగార్జునను ఇంప్రెస్ చేసి ఇలా సైలెంటుగా సినిమా తీసేసిన ఈ డైరెక్టర్ ఎవరా అని అంతా చర్చించుకుంటున్నారు.
శ్రీ రంజని టాలీవుడ్ జనాలకు పెద్దగా పరిచయం కూడా లేదు. ఎందుకంటే ఆమె దర్శకత్వ విభాగంలో పని చేసింది టాలీవుడ్లో కాదు.. కోలీవుడ్లో. ధనుష్ అన్నయ్య అయిన ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ దగ్గర అసోసియేట్ గా చాలా ఏళ్ల పాటు పని చేసింది రంజని. అందుకే ‘రంగుల రాట్నం’ ట్రైలర్ రిలీజవుతున్న సందర్భంగా సెల్వ రాఘవన్ స్పందించాడు. ఈ ట్రైలర్ లింక్ షేర్ చేస్తూ రంజని తన అసోసియేట్ అనే విషయాన్ని వెల్లడించాడు. ఆమెకు ఆల్ ద బెస్ట్ చెప్పాడు. మరి విలక్షణ చిత్రాలకు పెట్టింది పేరైన సెల్వ రాఘవన్ నుంచి రంజని ఏం నేర్చుకుంది.. తెరపై తన గురువు లాగే ప్రత్యేకమైన ముద్ర వేస్తుందా లేదా అన్నది ఈ నెల 14న తేలుతుంది. ఆ రోజే ‘రంగులరాట్నం’ ప్రేక్షకుల ముందుకు రానుంది.