యాక్షన్ కింగ్ అర్జున్ పై హీరోయిన్ శృతి హరిహరన్ చేసిన లైంగిక వేదింపుల ఆరోపణల వివాదం తారా స్థాయికి చేరింది. లైంగిక వేదింపులు చేసిన శృతి హరిహరన్ పై అర్జున్ పరువు నష్టం దావా వేయడంతో శృతి నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి లైంగిక వేదింపుల కేసును పెట్టింది. బెంగళూరులోని కుబ్బాన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో అర్జున్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు అయ్యింది. ఎఫ్ ఐ ఆర్ నమోదు అవ్వడంతో పోలీసుల ముందుకు అర్జున్ రాక తప్పలేదు. పోలీసులు అర్జున్ కు విచారణకు సోమవారం హాజరు అవ్వాల్సిందిగా నోటీసులు పంపిన విషయం తెల్సిందే. పోలీసుల నోటీసులు అందుకున్న అర్జున్ ఆదేశాల మేరకు విచారణకు హాజరు అయ్యాడు.
విచారణలో భాగంగా కుబ్బాన్ పార్క్ పోలీసులు అడిగిన అన్ని విషయాలకు అర్జున్ సరైన సమాధానాలు ఇచ్చాడని, విచారణకు పూర్తిగా సహకరించడంతో పాటు, మళ్లీ పిలిచినప్పుడు వచ్చేందుకు కూడా ఓకే చెప్పినట్లుగా పోలీసులు మీడియాతో చెప్పుకొచ్చారు. ‘విస్మయం’ చిత్రం షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన గురించి అర్జున్ ను అడిగి తెలుసుకున్నారట. దాంతో పాటు ఆ సమయంలో ఉన్న ఇతర చిత్ర యూనిట్ సభ్యులను కూడా పోలీసులు ఎంక్వౌరీ చేస్తారని తెలుస్తోంది.
‘విస్మయం’ చిత్రం షూటింగ్ సమయంలో దర్శకుడు చెప్పకుండానే హీరో అర్జున్ తనను దగ్గరకు లాక్కుని, వీపు మీద అసభ్యంగా చెతులతో టచ్ చేశాడు అంటూ శృతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయమై కూడా అర్జున్ ను పోలీసులు ప్రశ్నించారని, ఆయన పూర్తిగా సానుకూలంగా సమాధానాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ వివాదం మరీ ఇంత వరకు వస్తుందని ఊహించలేదని, అర్జున్ ను పోలీస్ స్టేషన్ కు వెళ్లేలా చేసిన శృతిని కన్నడ సినిమా పరిశ్రమ నుండి బ్యాన్ చేయాలంటూ అర్జున్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు ఇప్పటికి కూడా కన్నడ సినీ పరిశ్రమ పెద్దలు రాజీ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.