సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ఎలాంటి కొత్త పని చేసినా అభిమానులకు ఎంతో ఉత్సాహం కలుగుతుంది. అంటే ఓ స్టార్ హీరో యాక్టింగ్ కాకుండా మధ్యలో బ్రేక్ తీసుకొని ప్రజాసేవ చేశాడంటే అభిమానులు ఎంతో సంతోషిస్తారు. ఆ హీరో సినిమాలు చేస్తూ బ్రేక్ తీసుకున్నాడని కాదు. మాములుగా ఫేవరేట్ యాక్టర్ సినిమాలు కాకుండా నేరుగా జనాల్లోకి వచ్చాడని.. అలాగే ఆయనను నేరుగా కలిసే అవకాశం వస్తుందని అనుకుంటారు. మొత్తానికి తమ ఫేవరేట్ యాక్టర్ ఓ కొత్త పని చేశాడంటే ఖచ్చితంగా ఆనందం వ్యక్తం చేస్తారు.
తాజాగా టాలీవుడ్ సినీ ప్రేక్షకులకి అలాంటి ఫీల్ కలిగించాడు సీనియర్ యాక్టర్ నరేష్. ఆయన గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. కాకపోతే ఈ జనరేషన్ పిల్లలకు పరిచయం లేదు కాబోలు. కానీ తాజాగా నరేష్ తాను స్వయంగా తన తోటలో పండించిన మామిడి పళ్ళను.. నేరేడు పళ్ళను అమ్మడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అందులోను అవి అమ్మి ఆయన సుమారు 3600/- సంపాదించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తెలిపారు. సినిమా ఇండస్ట్రీ వారు సినిమాలే కాకుండా అదనంగా బయట వేరే పనులు చేస్తుంటారు.
అలాగే నరేష్ కూడా ఫామ్ హౌస్ తోటలో ఫ్రూట్స్ పండించి అమ్మడం విశేషం అనే చెప్పాలి. ఆయన సోషల్ మీడియా సేల్ చేసిన ఫోటోస్ కూడా పోస్ట్ చేసాడు. ఆ పళ్ళను ఆఫీస్ కు తీసుకొచ్చి అమ్మారు. "నేను నా తోటలో పండించిన మామిడి పళ్లు.. నేరేడు పళ్ళను ఈరోజు 50 రూపాయలకు కిలో చొప్పున అమ్మేసాను. మొత్తంగా ఈరోజు పళ్లు అమ్మి 3600/- సంపాదించాను. ఒక సినీ నటుడుగా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న దానికంటే ఇప్పుడు స్వయంగా వ్యవసాయం చేసి సంపాదించిన సంపాదనకే ఎక్కువ ఆనందంగా ఉందని ట్విట్టర్ లో ట్వీట్ చేసాడు. ప్రస్తుతం ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.