ఇంతకుముందే ఓసారి దర్శకుల ఆగ్రహానికి గురయ్యాడు కోన వెంకట్. ‘బాద్ షా’ విడుదలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ లో వైట్లను తిడుతూ తిడుతూ డైరెక్టర్ల గాలి కూడా తీసేయడం అప్పట్లో పెద్ద వివాదామైంది. దర్శకుల సంఘం నుంచి కోనకు వార్నింగ్ కూడా వెళ్లింది అప్పట్లో. తాజాగా మరోసారి వైట్ల విషయంలో కోన చేసిన విమర్శలు టూమచ్ గా ఉన్నాయంటూ దర్శకుల వర్గం ఉడికిపోతున్నట్లు సమాచారం అందుతోంది. అందులోనూ ఏదైనా బాహాటంగా మాట్లాడే ఓ పెద్ద డైరెక్టర్ కోన వెంకట్ విషయంలో చాలా కోపంతో ఉన్నారని.. దర్శకుల సంఘం కోన విషయంలో చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నాడని సమాచారం.
బ్రూస్ లీ సినిమా కోసం తాను 72 సన్నివేశాలు రాసిస్తే.. అందులో చాలా వరకు శ్రీను వైట్ల పక్కనబెట్టేశాడంటూ కోన విమర్శించిన సంగతి తెలిసిందే. ఐతే కోన రాసిన సన్నివేశాల్లో అంత కంటెంట్ ఉండి ఉంటే రామ్ చరణ్ వాటిని సినిమా కోసం వాడుకోమని చెప్పకుండా ఉంటాడా అని ఆ డైరెక్టర్ ప్రశ్నిస్తున్నాడు. కోనను ప్రాజెక్టులోకి ఏరి కోరి తీసుకొచ్చిన చరణ్.. అతను రాసిన సన్నివేశాల్లో పస ఉంటే వాటిని వైట్ల పక్కనబెట్టినపుడు ఊరుకునేవాడు కాదు కదా అని లాజిక్ తీస్తున్నాడా డైరెక్టర్. దర్శకుల విషయంలో ఏమాత్రం గౌరవం లేకుండా కోన అతిగా మాట్లాడుతున్నాడని.. అతడిపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన డిమాండ్ చేస్తూ దర్శకుల సంఘానికి ఫిర్యాదు కూడా చేశాడట. ఐతే శ్రీను వైట్ల మాత్రం కోన వ్యాఖ్యలపై స్పందించకుండా సైలెంటుగా ఉన్నాడు.