వెటరన్ హీరోలు పిలిచి అవకాశం ఇచ్చినా అందాల భామలు ససేమిరా అనడానికి కారణం ఏమిటి? కుర్రహీరోల నుంచి పిలుపు రాకపోవడం ఒక కారణం అనుకుంటే.. అసలు సీనియర్లతో నటిస్తే అది తమకు కెరీర్ పరంగా ఏవిధంగానూ కలిసిరాదనే భయం పట్టుకోవడం మరో కారణం అని విశ్లేషించవచ్చు.
అందుకు ప్రత్యక్ష ఉదాహరణలు ఉన్నాయి. ఇటీవలే కింగ్ నాగార్జున సరసన నటించింది రకుల్ ప్రీత్. మన్మధుడు 2 డిజాస్టర్ రిజల్ట్ ఈ అమ్మడిని తీవ్రంగా నిరాశపరిచింది. ఇక వెటరన్ అని తెలిసీ రొమాన్స్ కి అంగీకరించింది కాబట్టి ఈ అమ్మడికి యువహీరోలెవరూ అవకాశాలివ్వడం లేదు. ఆ క్రమంలోనే తెలుగులో కెరీర్ పూర్తిగా జీరో అయిపోయింది. రకుల్ కి బహుశా.. మన్మధుడు 2 చివరి అవకాశం అయ్యుంటుంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. మరో వెటరన్ బాలకృష్ణ సరసన నటించిన ఏ భామా రాణించినట్టు హిస్టరీలో లేదు. అందుకే ఆయనకు సీనియర్ భామల్నే ఎంపిక చేస్తున్నారు. గతంలో బాలయ్యతో నటించిన కుర్ర భామల కెరీర్ తిరిగి పట్టాలెక్కలేదు ఎందుకనో. సోనాల్ చౌహాన్ వరుసగా మూడు సినిమాల్లో నటించినా తనకు వేరొక హీరో పిలిచి అవకాశం ఇవ్వలేదు.
మెగాస్టార్ చిరంజీవి కి యువకథానాయికలు సూట్ కావడం లేదు. అందుకే నయనతార- తమన్నా- త్రిష అంటూ సీనియర్లను వెతుకుతున్నారు. కొరటాలతో 152వ మూవీ కోసం త్రిషను దించేస్తున్నారన్న టాక్ ఉంది. అంతకుముందు నయన్ ని సంప్రదించారని టాక్ వినిపించింది. విక్టరీ వెంకటేష్ సరసన వెంకీమామ చిత్రంలో నటించిన పాయల్ కి ఇటీవల సరైన ఆఫర్లు లేవు. ఆ తర్వాత ఇతర వెటరన్స్ అయినా తనని పిలిచి మరో అవకాశం ఇవ్వలేదేమిటో! ఇలా ఏ కోణంలో చూసినా వెటర్స్ సరసన నటిస్తే యంగ్ బ్యూటీ స్ పని అయిపోయినట్టే కనిపిస్తోంది. కెరీర్ అంతేగా అనుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.