సీనియర్ హీరోలు అలా సెట్ చేశారు

Update: 2017-08-28 17:08 GMT
పండుగ సీజన్ వచ్చిందంటే జనాల ఇళ్లలో సంబరాల సంగతేమో కానీ.. థియేటర్లు మాత్రం కళకళలాడిపోతున్నాయి. కొత్త సినిమాలతో టాలీవుడ్ వెలుగులు విరజిమ్మేస్తోంది. పండుగలే కాదు.. వీకెండ్స్ కు ఇంకొక్క సెలవు రోజు కలిసొచ్చినా సరే.. మూవీ రిలీజ్ లకు పోటీ పడిపోతున్నారు.

రాబోయే దీపావళి పండుగ కోసం కూడా ఇప్పుడు ఇలాంటి సీన్ కనిపించబోతోంది. ఇప్పటికే దసరా రేస్ ఫుల్ అయిపోవడంతో.. హీరోలంతా ఇప్పుడు దీపావళిని టార్గెట్ చేశారు. అయితే దీపావళికి షెడ్యూల్ చేసిన సినిమాలన్నీ సీనియర్ హీరోలవే కావడం ఆశ్చర్యకరం. రాజు గారి గది 2 ను దీపావళి సందర్భంగా అక్టోబర్ 13న విడుదల చేస్తున్నామంటూ.. ముందుగానే చెప్పేశారు అక్కినేని నాగార్జున. యాంకర్ నుంచి డైరెక్టర్ గా మారిన ఓంకార్.. ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. సీరత్ కపూర్.. సమంత ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.

మరోవైపు మాస్  హీరో గోపీచంద్ కూడా దీపావళి పైనే కన్నేశాడు. అక్టోబర్ 12న ఆక్సిజన్ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ.. వాయిదాల పర్వాన్ని పూర్తి చేసుకుని ఎట్టకేలకు దీపావళి రేసులో నిలిచింది. మొత్తానికి సీనియర్ హీరోలందరూ అలా సెట్ చేశారనమాట. చూద్దాం ఏమవుతుందో!!

నాగ్.. గోపీచంద్ లతో పోటీ పడేందుకు సై అంటున్నాడు రవితేజ. 2015 డిసెంబర్ లో వచ్చిన బెంగాల్ టైగర్ తర్వాత మరో సినిమాను విడుదల చేయని రవితేజ.. దీపావళి సందర్భంగా అక్టోబర్ 12న రాజా ది గ్రేట్ విడుదలను అనౌన్స్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వం కావడంతో.. ఈ చిత్రంపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి.
Tags:    

Similar News