సీనియర్ నటుడు నరేష్ ఇండస్ట్రీలోకి ప్రవేశించి ఈ ఏడాదితో 50 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ నెల 20న నరేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాల్ని గురువారం వెల్లడించారు. 1972లో వచ్చిన `పండంటి కాపురం` మూవీతో నరేష్ సినీ ప్రస్థానం మొదలైంది. ఇంతటి సుధీర్గమైన ప్రయాణానికి కారకులైన సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల, గురువు జంథ్యాల గారికి కృతజ్ఞతలు తెలిపారు నరేష్. ఈ సందర్భంగా ఆయన `మా` అసోసియేషన్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
`మా` అనేది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. మెంబర్స్ సంక్షేమం కోసమే దీన్ని పెట్టాం. `మా`ను పాలిటిక్స్ లో భాగంగా చూడకూడదు. మా సంభ్యుల సంక్షేమం కోసం మెగికవర్ లో 30 కార్పొరేట్ ఆసుపత్రులతో టై అప్ అయ్యాం. మేం మెంబర్ల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాం. ఛాంబర్, నిర్మాతలు అందరూ త్వరలోనే ప్రభుత్వాన్ని కలుస్తారని, మంచి నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాను. పొలిటికల్ గా పదవులు ఆశించి ఎప్పుడూ నేను రాజకీయాల్లోకి రాలేదు. సామాజిక సేవ కోసం అక్కడి నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు నా దృష్టంతా కూడా సినిమాల పైనే వుంది` అన్నారు.
అంతే కాకుండా సినీ పరిశ్రమల పై దాదాపు 22 వేల కుటుంబాలు ఆధారపడి వున్నాయని, వారి కోసం ఆలోచించాలని, సినిమాలపై ఫోకస్ పెట్టానని చెప్పారు. ఇప్పుడు తనకు రాజకీయాల గురించి తాను ఆలోచించడం లేదని, సినిమా పరిశ్రమ నన్ను గౌరవించి ఇన్ని మంచి పాత్రలు ఇస్తోందని, రాజకీయాల్లోకి వెళ్లిన పదేళ్లు .. నటుడిగా నన్ను నేను మిస్ అవుతున్నానని డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని చెప్పుకొచ్చారు.
నటుడిగా వరుస చిత్రాల్లో నటిస్తూ తీరిక లేకుండా గడిపేస్తున్న తనకు డైరెక్షన్ చేయాలని లేదని, అలాగని చేయకూడదని కూడా లేదని, భవిష్యత్తులో చేస్తానేమో అని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనాని తట్టుకుని మంచి చిత్రాలని ప్రేక్షకులకు అందించే చాలని, అదే మాకు గర్వంగా వుంటుందని తెలిపారు. గత ఏడాది మంచి పాత్రల్లో నటించానని, ఈ ఏడాది గల్లా అశోక్ తో కలిసి `హీరో` చేశానని, ఈ మూవీ మంచి పేరు తెచ్చిపెట్టిందని చెప్పారు.