యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ విక్రమ్ సినిమా తో మరోసారి తన స్టామినాను నిరూపించుకున్నాడు. కంటెంట్ సరిగ్గా ఉండాలి కానీ యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ సినిమాను ఇప్పటికి కూడా ఆయన అభిమానులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు చూసేందుకు ఆసక్తి చూపిస్తారని వెళ్లడయ్యింది.
అందుకే కమల్ హాసన్ తో ఒక భారీ ప్రాజెక్ట్ ను మణిరత్నం ప్లాన్ చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో 1987 లో నాయగన్ సినిమా వచ్చింది. ఆ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెలిసిందే. ఆ సినిమా వచ్చి ఇన్నేళ్లయినా కూడా ఇద్దరి కాంబో గురించి ఎప్పుడు కూడా ప్రస్తావన రాలేదు. ఎట్టకేలకు 37 సంవత్సరాల తర్వాత నాయగన్ కాంబో రిపీట్ కాబోతోంది.
ఇప్పటికే అధికారికంగా కమల్.. మణిరత్నం సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష ను పరిశీలిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇదే సమయంలో సినిమాలో పాన్ ఇండియా సూపర్ స్టార్స్ ఏడుగురు కీలకమైన గెస్ట్ రోల్స్ లో కనిపించబోతున్నారనే వార్తలు తమిళ సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి.
మలయాళం.. తెలుగు మరియు హిందీ సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ ను ఈ సినిమా కోసం సంప్రదించే అవకాశాలు ఉన్నాయట. ఇప్పటికే మలయాళ స్టార్ మమ్ముట్టీ మరియు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ లు ఈ సినిమా లో నటించేందుకు మణిరత్నంకు ఓకే చెప్పారని తెలుస్తోంది.
ఏడుగురు స్టార్స్ ఒకే సినిమా లో కనిపించడం అంటే సాధారణ విషయం కాదు. ఇప్పటి వరకు ఏ సౌత్ ఇండియన్ సినిమాలో కూడా నమోదు అవ్వని అరుదైన రికార్డుగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందబోతున్న కమల్ సినిమాతో నమోదు అవ్వబోతుంది.
మణిరత్నం మరియు కమల్ హాసన్ లు ఈ సినిమాను తమ సొంత బ్యానర్ లు మద్రాస్ టాకీస్ మరియు రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ ల్లో రూపొందబోతుంది. ఈ సినిమాను మంత్రి.. కమల్ యంగ్ హీరో ఉదయనిధి స్టాలిన్ సమర్పించబోతున్నాడు.