సూర్య కథనాయకుడిగా టీజే. జ్ఞాన్ వేల్ తెరకెక్కించిన 'జైభీమ్' ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. ఓటీటీలో రిలీజ్ అయినా ప్రేక్షకులకు రీచ్ అయిన అతి పెద్ద చిత్రంగా నిలిచింది. థియేటర్లో రిలీజ్ అయి సక్సెస్ అయితే ఎంత పేరొస్తుందో? అంతకుమించి ఓటీటీలో సక్సెస్ సాధించింది. న్యాయ వాది కె.చంద్రు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా పలు పురస్కారాలను సైతం దక్కిచుకుంది.
తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు నిర్మాత రాజశేఖర్ పాండియన్ తెలిపారు. .జై భీమ్ ని ఓ ప్రాంచైజీగా మలచడానికి చర్చలు జరిగాయి. చంద్రు జీవితంలో కొత్తకోణాన్ని రెండవ భాగంలో చూపించడానికి రెడీ అవుతున్నాం. తను అనుకున్న కథని దర్శకుడు పూర్తి స్థాయిలో సిద్దం చేసే పనిలోఉన్నట్లు' తెలిపారు. అయితే ఇందులో సూర్య యాధావిధిగా కొనసాగుతాడా? లేక మరో హీరోని తీసుకుంటారా? అన్నది రివీల్ చేయలేదు.
ప్రాంచైజీగా భావించిన నేపథ్యంలో దాన్నినుంచి ఎన్నికథలైనా వచ్చే అవకాశం ఉంది. అందులో ఒకే నటుడ్ని కొనసాగించడం అన్నది చాలా రేర్. ఒక్కో సినిమాలో ఒక్కో నటుడ్ని తీసుకుంటారు. తద్వారా ఆ కథకి ప్రెష్ ఫీల్ వస్తుంది. దర్శకులు మారితే ఇబ్బంది తప్ప! ప్రాంచైజీలో హీరోలు మారడం అన్నది పరిపాటే. బాలీవుడ్ లో ఈ తరహా ప్రాంచైజీలు చాలానే ఉన్నాయి.
'ధూమ్' ప్రాంచైజీలో ఒక్కో సినిమాలో ఒక్కో నటుడు నటించాడు. అలాగే దర్శకులు మారారు. మరి జైభీమ్ విషయంలో నిర్మాత పాండియన్ ఆలోచన ఎలా ఉందన్నది తెలియాలి. జైభీమ్ పురుడు పోసుకోవడానికి కారణం రాజశేఖర్ పాండియన్. న్యాయవాది కథను సినిమాగా మలిస్తే బాగుంటుందని భావించింది ఆయనే. పాండియన్ ఐడియానే దర్శకుడు అతను మెచ్చే కథలా సిద్దం చేసాడు.
ఇప్పుడా కథని కంటున్యూ చేస్తూ కొత్త కథని సిద్దం చేయిస్తున్నారు. ఆరకంగా నిర్మాతగా పెట్టుబడి పెట్టడమే కాదు..కథలపై తన అవగాహనని చాటుకుంటున్నారు. ప్రస్తుతం పాండియన్ ఇంకా పలు సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.