గత కొంతకాలంగా ఆర్జీవీ వీరంగం చూస్తున్నదే. `కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` అంటూ కుల రాజకీయాలు.. హత్యా రాజకీయాలపై సినిమా తీసి రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ శుక్రవారం రిలీజ్ కావాల్సినది.. అయితే చివరి నిమిషంలో వర్మ బృందానికి ఊహించని జోల్ట్ తగిలింది. ఈ సినిమా రిలీజ్ ని అడ్డుకుంటూ కోర్టు తీర్పు వెలువడింది. దీంతో ప్రస్తుతానికి మూవీ వాయిదా పడింది.
ఇక కోర్టు ఆర్డర్ ప్రకారం.. ఈ సినిమా టైటిల్ ని `అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు` అని మార్చనున్నారని తెలుస్తోంది. కోర్టు గొడవలు సహా సెన్సార్ నిర్వాకంపై తాజాగా మీడియా లైవ్ లో ఆర్జీవీ మండి పడ్డారు. ఈ సినిమాలో తాను ఏ కులాన్ని తక్కువ చేసి చూపించలేదని అన్నారు. రూల్ ప్రకారం.. మన సినిమాలేవీ రిలీజ్ కావడానికి లేదు. కానీ అన్ని రూల్స్ ని నాపైనే రుద్దారు! అంటూ ఆర్జీవీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఏ ఒక్క పార్టీ కోసమో.. వ్యక్తి కోసమో నేను సినిమా తీయలేను. సెటైర్ కోసం మాత్రమే తీశానని అన్నారు. తాను పడి లేచే కెరటాన్ని అని ఆర్జీవీ అన్నారు. ఎంత ఆపితే అంత లేస్తానని ఫైరయ్యారు. సెన్సార్ ని ఔట్ డేటెడ్ అని.. దానిని పట్టించుకోనని తూర్పార బట్టారు. ఓటు వేసి నాయకుల్ని ఎన్నుకునే మనకు ఏ సినిమా చూడాలో తెలీదా.. దానిని ముగ్గురు సెన్సార్ వాళ్లు చెప్పాలా? అంటూ తనదైన శైలిలో వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఇదే మీడియా లైవ్ లో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సీక్వెల్ తీస్తానని ఆర్జీవీ ప్రకటించడం ఆసక్తికరం.