ప‌ఠాన్ కి సీక్వెల్...కాన్పిడెన్సా? ఓవ‌ర్ కాన్పిడెన్సా?

Update: 2022-11-06 01:30 GMT
బాలీవుడ్ లో ప్రాంచైజీ త‌ర‌హా కంటెంట్ కొత్తేం కాదు. రిలీజ్ కి ముందే రెండు..మూడు భాగాలుంటాయ‌ని ముందుగానే ప్ర‌క‌టిస్తుంటారు. అయితే? అవి కొన‌సాగించాలా?  లేదా? అన్న‌ది ఫ‌లింత‌పై ఆధార‌ప‌డి ఉండేది ఇంత కాలం. ఇప్పుడా విధానంలో స్వ‌ల్ప మార్పు క‌నిపిస్తుంది. హిట్ తో సంబంధం లేకుండానే కొన‌సాగింపు క‌థ‌లు క‌నిపిస్తున్నాయి.

ఇటీవ‌లే 'బ్రహ్మ‌స్ర్త' మొద‌టి భాగం భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయి ఎలాంటి ఫ‌లితాలు సాధించిందో  తెలిసిందే. 400 కోట్ల బ‌డ్జెట్ సినిమా 200 కోట్ల వ‌సూళ్ల‌తో అకౌంట్ క్లోజ్ చేయాల్సి వ‌చ్చింది. అంటే 200 కోట్ల న‌ష్టం భారం త‌ప్ప‌లేదు. కేవ‌లం భారీ ఓపెనింగ్స్ రావ‌డంతోనే అది సాధ్య‌మైంది. అప్ప‌టికే హిట్ లేక వెల వెల‌బోతున్న బాలీవుడ్ ఆ వ‌సూళ్ల‌నే ప‌ర‌మావ‌ధిగా భావించాల్సి వ‌చ్చింది.

ఇలా మొద‌టి భాగం న‌ష్ట‌పోయిన సినిమాకి రెండ‌వ భాగం కూడా ఉంది. 'బ్ర‌హ్మ‌స్ర్త‌-2'తో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి రెడీ అవుతున్నారు. నిజానికి రెండ‌వ భాగం ఉంటుంద‌ని ఆన్ సెట్స్ లో ఉండ‌గానే బ‌య‌ట‌కు వ‌చ్చింది.  కానీ ఫ‌లితం త‌ర్వాతే ఆధార‌ప‌డి ఉంటుంద‌ని ప్రేక్ష‌కులు అంచ‌నా వేసారు. కానీ అంద‌ర్నీ అంచ‌నాల్ని తారుమారు చేస్తూ బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిలైనా ఆయాన్ ముఖ‌ర్జీ అండ్ కో వెన‌క్కి త‌గ్గ‌లేదు.

తాజాగా బాద్ షా షారుక్ ఖాన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'ప‌ఠాన్' వ‌చ్చే ఏడాదా జ‌న‌వ‌రిలో రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ట్రైల‌ర్ రిలీజ్ అయింది. ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ పెద‌వి విరిచేసారు.  అయితే ఈ సినిమాకి సీక్వెల్  ఉంటుంద‌ని  వెలుగులోకి వ‌చ్చింది. ఇదే విష‌యాన్ని షారుక్ దృష్టికి తీసుకెళ్ల‌గా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు.

ప‌ఠాన్ కి సీక్వెల్ రావాల‌ని అంద‌రూ ప్రార్ధించండి.  ఈ సినిమా క‌చ్చితంగా న‌చ్చుతుంది. రెండ‌వ భాగానికి సంబంధించి ప్లానింగ్ జ‌రుగుతోంద‌ని రివీల్ చేసారు. దీన్ని బ‌ట్టి ప‌ఠాన్ కొన‌సాగింపు క‌థ ఉంద‌ని అభిమానులు అంచ‌నాకి వ‌స్తున్నారు. అయితే షారుక్ మాత్రం కాస్త  బ్యాలెన్స్ గానే మాట్లాడారు. అభిమానుల మీద‌కు భారం నెట్టేసి మీరు రెడీ అంటే మేము రెడీనే అన్న సంకేతాలు పాస్ చేసారు.

అయితే షారుక్ యాంటీ గ్యాంగ్ మాత్రం ప‌ఠాన్ రిలీజ్ కాకుండానే రెండ‌వ భాగం గురించి రివీల్ చేయ‌డంపై  సె టైర్లు గుప్పిస్తున్నారు. 'ప‌ఠాన్' పై కాన్పిడెన్సా? ఓవ‌ర్ కాన్సిడెన్సా? అంటూ కామెంట్ చేస్తున్నారు. బ్ర‌హ్మ‌స్ర్త మొద‌టి భాగం విష‌యంలో ఇలాగే జ‌రిగింది. అతి  వ్యాఖ్య‌లే అన‌ర్ధాలు తెచ్చాయంటూ గుర్తు చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News