అందానికి ఐకాన్ ఐశ్వర్యారాయ్. వయసు మీద పడుతున్నా బింకం తగ్గని అమ్మడి అందాలు చూసిన వారంతా ఫిదా కావాలంతే. ఆమె సౌందర్యానికి పాదక్రాంతులు కాక తప్పదు. మొన్నటికి మొన్న కేన్స్ లో తన బంగారువర్ణంతో పొడుగాటి గౌన్ తో మెరిసిపోయిన ఐష్ సౌందర్యపిపాసుల్ని ఐస్ చేసేసింది. ఇంత అందం ఎలా సాధ్యం ఐష్ అని అందరూ అనుకునే వారే. అలాంటి ఐష్ ను తాజాగా చూసినవాళ్లంతా జడుసుకుంటున్నారు.
అందానికే అందంగా ఉండే ఐష్.. అందుకు భిన్నంగా తయారు కావటంతో కోట్లాది మంది షాక్ తిన్న పరిస్థితి. అందుకేనేమో.. తమ బాధను.. ఆవేదనను అక్షరాలుగా మార్చేసి సోషల్ మీడియాలో మొత్తంగా నింపేస్తున్నారు. ఇంతకీ అభిమానుల్ని అంతలా వేదనకు గురి చేసేలా ఐష్ ఏం చేసిందంటారా? తాజాగా అమ్మడి పెదాలకు వేసుకున్న లిప్ స్టిక్ తో ఐష్ అభిమానులే కాదు.. ఇంతకాలం ఐష్ అందాలకు పిధా అయిన వారంతా హాహాకారాలు చేసే పరిస్థితి.
కేన్స్ చిత్రోత్సవంలో భాగంగా తాను తాజాగా నటించిన సరబ్ జీత్ సినిమా స్క్రీనింగ్ కోసం హాజరైన ఐష్.. కాస్త ముదురు బేబీ పింక్ గౌన్ ధరించింది. ఈ డ్రెస్ కు ఏ మాత్రం మ్యాచ్ కాని రీతిలో కనురెప్పల్ని బండగా.. ఒత్తగా నల్ల కాజల్ తో దిద్దేయటమే కాదు.. పెదాలకు వేసుకున్న పర్పుల్ కలర్ లిప్ స్టిక్ చూసిన వాళ్లంతా షాక్ తినేశారు. నిన్నమొన్నటి వరకూ యాభై కిలోల తాజ్ మహాల్ గా ఫీలైన ఐష్ ఆంటీ అలా తయారైందేమిటంటూ ఫీలైపోయినోళ్లూ ఉన్నారు.
ఆమె తాజా మేకప్ చూసినోళ్లు షాక్ తిన్న కొంతమంది అభిమానులైతే ఒక అడుగు ముందుకేసి.. ఐష్ కు మేకప్ చేసినోడి మీద కేసు పెట్టాలని.. ఇంకొందరు ఏషియన్ పెయింట్ ను అంతలా వాడేయటమేమిటి? అంటూ ఎటకారం చేసేసుకున్నారు. బ్లాక్ కరెంట్ ఐస్ క్రీం టన్నులు టన్నులు తినేశాక పెదాలు ఆ రంగులోకి మారిపోయిన చందంగా ఐష్ ఆంటీ తయారైతే ఏ అభిమాని మాత్రం భరించగలరు. అందుకే.. టన్నుల కొద్దీ అభిమానం ఉన్నా.. అంతకు రెట్టింపు ఆవేదనకు గురి చేసిన ఐష్ ను కొరివి దెయ్యం అనక తప్పట్లేదని ఆమె అభిమానులు సైతం ఫీలైపోతున్నారు. ఏందుకిలా చేశావ్ ఐష్..?