స్పీల్ బ‌ర్గ్ తో పూల‌రంగ‌డి పోలికేంటి?

Update: 2023-01-04 03:39 GMT
భారతదేశంలో గ‌ట్స్ ఉన్న‌ నటిగా షబానా అజ్మీకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తనలోనియ‌విల‌క్ష‌ణ‌త‌ను అద్భుతమైన ప్రతిభను బ‌య‌ట‌పెట్టేందుకు ఇత‌రుల‌కు స‌వాల్ విసిరేందుకు కొత్త అవకాశాల కోసం వెత‌క‌డం త‌న హాబీ. గత రెండేళ్ల‌లో త‌న మార్గానికి అనువుగా కొత్త తలుపులు తెరిచిన ఇద్దరు కొత్త చిత్రనిర్మాతలను ఆమె క‌లిసింది.  సత్యజిత్ రే- మృణాల్ సేన్- రోలాండ్ జోఫ్ఫ్- గౌతమ్ ఘోస్ - మహేష్ భట్ వంటి ప్రముఖులకు అత్యంత స‌న్నిహితురాలిగా మెలిగే షబానా తాజాగా త‌న అద్భుతమైన ద‌ర్శ‌క‌నిర్మాతల జాబితాలో స్టీవెన్ స్పీల్‌బర్గ్ తో పాటు  కరణ్ జోహార్ ని జోడించబడ్డారు.

స్పీల్‌బర్గ్ హాలో చిత్రాన్ని నిర్మించారు. ఇందులో షబానా ప్రధాన పాత్రధారుల్లో ఒక‌రిగా న‌టించారు. 76 ఏళ్ళ వయసులో స్టీవెన్ స్పీల్ బర్గ్ కు పిల్లల శ‌క్తి- ఉత్సాహం కొత్త సవాళ్ల పట్ల ఆసక్తి ఉంది. అతను ఎప్పటికీ కొత్త ఆలోచనలను అన్వేషిస్తూనే ఉంటాడు. తన ప్రశంసలపై విశ్రాంతి తీసుకోడు''అని షబానా చెప్పారు.

కరణ్ జోహార్ విషయానికొస్తే.. తాను చేసే ప‌నిలో నిబద్ధత చూసి తాను ఆశ్చర్యపోయానని షబానా చెప్పింది. కరణ్ జోహార్ గురించి ఆలోచించినప్పుడు అతను పార్టీలలో బ‌య‌ట కూడా ఒక ఆకర్షణీయమైన ప్రముఖ వ్యక్తిగా భావిస్తాడు.

అతను అంత నిబద్ధత కలిగిన చిత్రనిర్మాత అని తెలిశాక‌ నాకు పూర్తి ఆశ్చర్యం కలిగించింది. ఒకే ఫ్రేమ్ లో చాలా మంది నటీనటులను డైరెక్ట్ చేయడం అంత సులువు కాదు. కానీ రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీలోని ప్రతి పాత్రకు పూర్తి న్యాయం చేశాడు... అని కితాబిచ్చారు.

షబానా మాట్లాడుతూ.. ''నా సినిమాల్లో ఇంత గ్లామర‌స్ గా కనిపించే అవకాశం ఎప్పుడూ రాలేదు. నవంబర్ లో మేము ఢిల్లీలో షూటింగ్ లో ఉన్నామని నాకు గుర్తుంది. ఆ రోజు షూటింగ్ ముగిసిన వెంటనే నేను వివాహానికి హాజరు కావాల్సి వచ్చింది. షూటింగ్ కి నేను కట్టుకున్న అదే చీర‌ను నగలు ధరించి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. మా డిజైనర్ మనీష్ మల్హోత్రా ఆశ్చర్యపోయాడు.

'నువ్వు కాస్ట్యూమ్ జ్యువెలరీలో ఎలా వెళ్లగలవు? కనీసం మీకు ధరించడానికి నిజమైన ఆభరణాలైనా ఇవ్వనివ్వండి.' కానీ నేను ఎలా ఉన్నానో అలాగే వెళ్లాలని నిర్ణయించుకున్నాను. నేను ఎంత అందంగా ఉన్నానో సాయంత్రం అంతా నన్ను అభినందించారు. .. అంటూ ష‌బానా మెమ‌రీ లేన్ లోకి వెళ్లారు. ప‌ని నిబద్ధ‌త విష‌యంలో స్పీల్ బర్గ్ స్ఫూర్తితో క‌ర‌ణ్ పని చేస్తుంటారు. సాంకేతిక‌తు అందిపుచ్చుకోవవంలో ఆయ‌న‌ను కొట్టేవాళ్లే లేరు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News