ఇప్పుడు ఫిలిం ఇండస్ర్టీ అంతా కూడా ఎవరు హడావుడి చేస్తారో వారిదే రాజ్యం అన్నట్లు తయారైంది. ఇక్కడ ఎవరికి వాయిస్ ఉంటే వారే గ్రేటు. అలాగే ఎవరు హాటుగా కనిపిస్తే వారే ఫ్యాషనిస్టా. చేసే సినిమాలు.. క్యారక్టర్ పండించిన తీరు.. కథనాన్ని ఇనుమడింపచేసుకున్న విధానం కంటే కూడా.. చాలామంది నటీమణులు డ్రస్సులే కీలకం అవుతున్నాయి.
అన్నింటికంటే ముఖ్యంగా.. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వంటి చోట రెడ్ కార్పెట్ పై నడవాలంటే.. ఐశ్వర్య రాయ్.. సోనమ్ కపూర్ వంటి భామలందరూ క్లీవేజ్ సోకులు ఆరబోస్తూ.. కొత్త కొత్త డిజైనర్ దుస్తులు ధరిస్తూ హడావుడి చేస్తున్నారు. బట్టలతో రచ్చ చేయడం తప్పించి.. అక్కడ మన సినిమాలతో ప్రూవ్ చేసుకోవడం ఎప్పుడో మానేశాం. సరిగ్గా ఇదే విషయంపై కామెంట్ చేసిన సీనియర్ నటీమణి షబానా ఆజ్మి.. పాత కాలంనాటి ఫోటో ఒకటి షేర్ చేసి.. ఈ విధంగా చెప్పింది.
''1976లో నిశాంత్ సినిమా కోసం కాన్స్ ఫిలిం ఫెస్టివల్ కు వెళ్ళాం. అప్పట్లో ఎంత సింపుల్ గా వెళ్ళామంటే.. అక్కడ బట్టలు ఇంపార్టెంట్ కాదు.. మా సినిమాయే ముఖ్యం'' అంటూ పంచ్ వేసింది షబానా. నిజమే కదా.. మన సినిమాలు అసలు హడావుడి చేయకుండా.. కేవలం బట్టలతో అందాలను ఆరబోస్తే ఉపయోగం ఏముంటుంది? వింటున్నారా భామలూ!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/