ఏపీ టాలీవుడ్ క‌ద‌లిక‌ల‌ వెన‌క షాడో ఎవ‌రు?

Update: 2022-05-30 03:10 GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్  26 జిల్లాలలో చలనచిత్ర పరిశ్రమ పట్ల అవగాహన పెంచడం కోసం జిల్లాకొక  కో-ఆర్డినేటర్ ను  నియమించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఈరోజు (29-05-2012) హ్యపీ  రిసార్ట్స్- మంగళగిరిలో  ప్రెస్ మీట్  నిర్వహించి 7 జిల్లాలకు కోఆర్డినేటర్లను నియమించారు. ప‌రిశ్ర‌మ సంబంధీకుల‌తో కూడుకున్న క‌మిటీ ఇవి. మునుముందు దీనికి పెద్ద గ్లామ‌ర్ ని యాడ‌ప్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. అలాగే ఓ ప్ర‌ముఖ‌ సూప‌ర్ స్టార్ ఏపీ టాలీవుడ్ నిర్మాణ క‌మిటీల‌ వెన‌క ఉన్నార‌న్న గుస‌గుస కూడా ఇటీవ‌ల వైర‌ల్ గా మారింది. ఏపీ టాలీవుడ్ క‌ద‌లిక‌ల‌ వెన‌క షాడో ఎవ‌రు? అన్న‌ది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్. తొంద‌ర్లోనే ఆ వివ‌రాలు కూడా వెల్ల‌డించ‌నున్నార‌ని తెలుస్తోంది.

ప్రకాశం జిల్లాకు తనికొండ వెంకటేశ్వర్లు.. గుంటూరు జిల్లాకు కొత్త సూర్య .. బాపట్ల జిల్లాకు నల్లమోతు మాదవి.. NTR జిల్లాకు పులి రమణారెడ్డి .. కృష్ణా జిల్లాకు పచ్చిగొల్ల వెంకటేశ్వరరావు .. పశ్చిమ గోదావరి జిల్లాకు Ch. సత్య వరప్రసాద రాజు .. పల్నాడు జిల్లాకు ముత్యాల వెంకట రావు ల‌ను నియమించారు.

కార్యక్రమంలో అద్యక్షులు అంబటి మధుమోహన కృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షూటింగ్ ల‌కు అనువైన అందమైన లోకేషన్లు ఎన్నో వున్నాయని ఆంధ్ర రాష్ట్రంలో షూటింగ్ చేస్తే గవర్నమెంటు ఎన్నో రాయితీలను ఇస్తుందని వాటన్నింటి పట్ల ప్రజలలో అవగాహన పెంచి ఆంధ్ర రాష్ట్రంలోనే షూటింగ్ లు ఎక్కువ శాతం జరిగేలా చేయడానికి మా చాంబర్ తరపున చిత్తశుద్ధితో పని చేస్తున్నామని దానికి ప్రజలంతా సహకరించాలని కోరారు.

వ్యవస్థాపక అధ్యక్షులు రాజా వాసిరెడ్డి భూపాల్ ప్రసాద్ మాట్లాడుతూ.. మేము నాటిన చాంబర్ అనే విత్తనం ఈ రోజు మహావృక్షమైందని కోఆర్డినేటర్ల నియామకం ద్వారా ఛాంబర్ మెంబర్లకు మెరుగైన సేవలందించవచ్చని  పరిశ్రమ అభివృద్ధికి  అన్ని విధాలా సహకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా వుంటామని తెలిపారు.

చాంబర్ ప్రధాన కార్యదర్శి జె.వి.మోహన్ గౌడ్ మాట్లాడుతూ ఈ నెల 19వతేదీ వైజాగ్ లో ప్రెస్ మీట్ నిర్వహించి జిల్లాలకు కోఆర్డినేటర్లను నియమించామని ఈరోజు ఆరు జిల్లాలకు కో ఆర్డినేటర్ లను నియమిస్తున్నామని ఈ కో ఆర్డినేటర్ ల వల్ల సినిమాలు తీసే నిర్మాతలకు పూర్తి అవగాహనతో పాటు అనవసరమైన ఖర్చులు కూడా తగ్గుతాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా షూటింగ్ లు జరిగేలా చేసి ఇక్కడి సినీ కార్మికులకు అవకాశాలు మెరుగు పడేలా చేయడమే ఛాంబర్ ప్రధాన లక్ష్యం అని తెలిపారు.

ఇంకా ఈ కార్యక్రమంలో ట్రెజరర్ యం.శ్రీనాధరావు.. జాయింట్ సెక్రటరీ మోడల్ ఫిల్మ్స్ శివ.. కార్యవర్గ సభ్యులు అబిద్ హుస్సేన్.. కాసుల రామకృష్ణ,.. PDR ప్రసాద్ రెడ్డి,.. నిర్మాతలు కె. నాగ వెంకట జోగిరాజు,.. యం. శ్రీనివాస రావు పాల్గొన్నారు. ఇన్నాళ్లు లేనిది ఏపీ టాలీవుడ్ అంటూ సాగుతున్న ఈ క‌మిటీల వ్య‌వ‌హారం వెన‌క షాడో ఎవ‌రు? అన్న‌ది మునుముందు రివీల్ కానుంద‌ని తెలిసింది.
Tags:    

Similar News