నేను కష్టాల్లో ఉన్నప్పుడు వారే ఆదుకున్నారు

Update: 2018-09-04 07:04 GMT
బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు సల్మాన్‌ ఖాన్‌ మరియు షారుఖ్‌ ఖాన్‌లు సినిమాల పరంగా పోటీ తత్వం ఉంటుంది - ఇద్దరు ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తారేమో కాని ఇద్దరు మాత్రం మంచి స్నేహితులు అనే విషయం తెల్సిందే. గతంలో వీరిద్దరు పలు సినిమాల్లో కలిసి కనిపించారు, పలు షోల్లో వీరిద్దరు సందడి చేసిన సందర్బాలు ఉన్నాయి. వీరి అభిమానులు మాత్రం ఢీ అంటే ఢీ అనుకుంటూ ఉంటారు. ఇలాంటి సమయంలో సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌ గా ప్రసారం అవుతున్న దస్‌ కా దమ్‌ ఫైనల్స్‌ కు షారుఖ్‌ ఖాన్‌ గెస్ట్‌ గా హాజరు అయ్యాడు. షోలో సల్మాన్‌ ఖాన్‌ తో తన అనుబంధం గురించి షారుఖ్‌ ఖాన్‌ మాట్లాడుతూ గతంలో ఎప్పుడు చెప్పని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.

షారుఖ్‌ ఖాన్‌ సినిమా పరిశ్రమపై ఆసక్తితో ముంబయి వచ్చిన సమయంలో చాలా కష్టాలు పడ్డాడు. తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పడ్డ కష్టాలను గతంలో పలు సార్లు - పలు వేదికలపై చెప్పుకొచ్చిన షారుఖ్‌ ఖాన్‌ తాజాగా ఆ సమయంలో తనకు సల్మాన్‌ ఖాన్‌ ఫ్యామిలీ అందించిన సపోర్ట్‌ గురించి చెప్పుకొచ్చాడు. సల్మాన్‌ ఖాన్‌ తండ్రి అయిన ప్రముఖ రచయిత సలీం ఖాన్‌ కష్టాల్లో ఉన్న నన్ను ఆధరించాడు. నటుడిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో బోజనం పెట్టారని - ఆ సమయంలో సలీం ఖాన్‌ తనకు ఇచ్చిన ప్రోత్సాహంను ఎప్పటికి మర్చి పోలేను అంటూ షారుఖ్‌ ఖాన్‌ చెప్పుకొచ్చాడు.

సలీం ఖాన్‌ ప్రోత్సాహం కారణంగానే ప్రస్తుతం తాను ఈ స్థాయిలో ఉన్నానని - కెరీర్‌ ఆరంభంలో సల్మాన్‌ ఖాన్‌ కూడా తనకు సాయం చేశాడు అంటూ షారుఖ్‌ గతంను తలుచుకుని భావోద్వేగంకు లోనయ్యాడు. షారుఖ్‌ హీరోగా స్టార్‌ డం దక్కించుకున్న తర్వాత కొన్ని కారణాల వల్ల సల్మాన్‌ తో విభేదాలు వచ్చాయి. అయితే ఆ విభేదాలు ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇద్దరి మద్య విభేదాలు ఇలా వచ్చి అలా వెళ్లి పోయాయి. ఆమద్య సల్మాన్‌ ఖాన్‌ చెల్లి వివాహం సందర్బంగా కూడా షారుఖ్‌ ఖాన్‌ సందడి చేసిన విషయం తెల్సిందే. ఈ షోకు రావడంకు ప్రధాన కారణం సల్మాన్‌ ఖాన్‌ అని, ఆయన ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తాను, ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి వెళ్తాను అంటూ నవ్వుతూ అన్నాడు. షారుఖ్‌ ఖాన్‌ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.

Tags:    

Similar News