ఈ మద్య కాలం లో సక్సెస్ లు లేక కాస్త ఢీలా పడ్డా కూడా షారుఖ్ ఖాన్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ దేశంలో మరెవ్వరికి లేదు అంటూ ఆయన అభిమానులు సగర్వంగా చెబుతూ ఉంటారు. ఇంకా అయిదు పదేళ్లు షారుఖ్ ఖాన్ సినిమాలు చేయకున్నా.. ఫ్లాప్ సినిమాలు చేసినా కూడా ఆయనపై మా అభిమానం ఇసుమంతైనా తగ్గదంటూ ఆయన అభిమానుల బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. అంతటి అభిమానులను కలిగి ఉన్న షారుఖ్ ఖాన్ తాజాగా రిపబ్లిక్ డే సందర్బంగా జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాటలు బాద్ షా నీకు హ్యాట్సాప్ అనేలా ఉన్నాయి.
డాన్స్ ప్లస్ 5 షో స్పెషల్ ఎపిసోడ్ లో రిపబ్లిక్ డే సందర్బంగా ప్రత్యేక అతిథిగా హాజరు అయిన షారుఖ్ ఖాన్ ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడిన సందర్బంగా తమ మతం గురించి ఇండస్ట్రీలో మరియు ఇండియాలో ఉన్న అనుమానాలపై క్లారిటీ ఇచ్చాడు. కులం మతం మన మద్య వద్దు, మనమంతా భారతీయులం. మనమంతా ఒక్కటై కలిసి ఉందాం అంటూ పిలుపునిచ్చాడు. ఒక ముస్లీం అనే వాడు రోజుకు అయిదు సార్లు నవాజు చేయాలి. ఆ లెక్క ప్రకారం చూస్తే నేను అసలు ముస్లీం నే అవ్వను. కాని నాకు ఇస్లాం అంటే గౌరవం.. ఇస్లాం సాంప్రదాయాలపై పూర్తి నమ్మకం ఇష్టం ఉందన్నాడు. అలాగే నా భార్య హిందువు కనుక ఆమె ఇష్టాలను కూడా నేను గౌరవిస్తాను.
ఇక నా పిల్లలకు మత అనే విషయాన్ని అంటించలేదు. వారి స్కూల్ ఫామ్ లో మతం అని ఉన్న చోట ఇండియన్ అంటూ రాశామంటూ చాలా గొప్పగా చెప్పాడు. మతంతో అక్కర్లేదని అంతా కలిసి మెలిసి ఉంటే చాలంటూ జాతి స్ఫూర్తి దాయక మాటలను బాద్ షా చెప్పాడు. అందుకే ఆయన అభిమానులు ఆ వీడియోను షేర్ చేసిన బాద్ షా నీకు హ్యాట్సాఫ్ అంటూ ప్రచారం చేస్తున్నారు.