బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ - టాలీవుడ్ కింగ్ నాగార్జున కలవడం అంటే చిన్న విషయం కాదుగా. ఒమన్ లో ఈ కనువిందైన దృశ్యం నిజమయ్యింది. దానికి కారణం కళ్యాణ్ జ్యువెలర్స్. తమ గోల్డ్ రిటైల్ బిజినెస్ కోసం ఒక్కో బాషలో ఒక్కో స్టార్ హీరోను తమ బ్రాండ్ అంబాసడర్ గా నియమించుకున్న కళ్యాణ్ సంస్థ హిందిలో షారుఖ్ ఖాన్ ని తీసుకున్న సంగతి తెలిసిందే. ఒమన్ దేశంలో తమ కొత్త షో రూమ్ ఓపెనింగ్ కోసం షారుఖ్ తో పాటు తమ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తున్న స్టార్లందరినీ తీసుకెళ్ళిన కళ్యాణ్ జువెలర్స్ ఒక అపురూప సంగమం లాంటి సీన్ క్రియేట్ చేసింది. నాగ్ - షారుఖ్ లతో పాటు కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ - తమిళ్ సీనియర్ హీరో ప్రభు - మలయాళం నుంచి మంజు వారియర్ ఇలా అందరికి ఒకే చోట కలిసే వేదిక ఏర్పాటు చేసింది.
ఇది ఎలా బయటికి వచ్చింది అనుకుంటున్నారా. షారుఖ్ ఖాన్ స్వయంగా తాను ఒమన్ కు వెళ్తున్న విషయాన్నీ ట్విట్టర్ లో అప్ డేట్ చేసి ఈవెంట్ ఫొటోస్ ని స్వయంగా పోస్ట్ చేసాడు. వీటిని చూసిన ఫాన్స్ షేర్ చేసుకోవడంతో ఇవి కాస్త వైరల్ అయ్యాయి. గోల్డ్ బిజినెస్ భారతదేశం లోనే కాక మనీ ఫ్లోటింగ్ అధికంగా ఉండే అరబ్ దేశాల్లో బాగా స్వింగ్ లో ఉంది. అందుకే మలబార్ - కళ్యాణ్ - తనిష్క్ లాంటి సంస్థలు కోట్ల రూపాయల పెట్టుబడితో అక్కడ తమ బ్రాంచులు ఓపెన్ చేసుకుంటున్నారు. రెమ్యునరేషన్ ఎంత అనేది లెక్క చేయకుండా మరీ స్టార్ హీరోలను వివిధ బాషలకు వాడుకుంటున్నారు. డబ్బులు ఊరికే రావు అన్నట్టు తారలు కూడా ఊరికే రారు.