సుశాంత్ సింగ్ ఆకస్మిక మరణం అనంతరం బాలీవుడ్ లో పరిణామాలు తెలిసిందే. నటవారసత్వం (నెప్టోయిజం) హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా సుశాంత్ సింగ్ అభిమానులు సహా పలువురు బాలీవుడ్ లో మాఫియా ఆగడాలకే అతడు బలయ్యాడని ఆరోపించారు. నెటిజనుల్లో ఇది నిరంతరం డిబేట్ గా మారింది.
ఆ క్రమంలోనే కపూర్స్.. ఖాన్స్.. భట్స్ సహా పలువురికి సామాజిక మాధ్యమాల్లో విద్వేష పూరిత బెదిరింపులు ఎదురయ్యాయి. ఇందులో ముఖ్యంగా ప్రముఖ దర్శక నిర్మాత మహేష్ భట్ కుమార్తెలు అయిన ఆలియా భట్ .. షాహీన్ భట్ కి వేధింపులు ఎదురయ్యాయి. సామాజిక మాధ్యమాల వేదికగా ఆలియా సహా షాహీన్ పై దుర్భాషలాడిన నెటిజనులు ఆలియా సోదరి షాహీన్ ని రేప్ చేసి చంపేస్తామని బెదిరించారట. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను షాహీన్ షేర్ చేశారు. ఆలియా దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు.
అంతేకాదు ఈ తరహా విద్వేష పూరిత బెదిరింపుల్ని సీరియస్ గా తీసుకుని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని షాహీన్ వెల్లడించారు. కొన్ని అనామక సైట్ల నుంచి బెదిరింపులకు పాల్పడినా వారి ఐపీ అడ్రెస్ ల ద్వారా అరెస్టులు చేయడం ఖాయమని ఆమె అంటున్నారు. మొత్తానికి నటవారసత్వం అన్న టాపిక్ నేరాలను ప్రేరేపిస్తోందని అర్థమవుతోంది. ఇక ఆలియా నటించిన `సడక్ 2` ఫస్ట్ లుక్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ ని బ్యాన్ చేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. ఇదంతా నెప్టోయిజం ప్రాభావమేనని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.