షాహిద్ కపూర్ - కరీనా కపూర్ కాంబినేషన్ అంటే క్రేజ్ ఏర్పడుతుంది. వీళ్లిద్దిరికి తోడు బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆలియా భట్ కూడా అదే సినిమా చేయడమంటే.. 'ఉడ్తా పంజాబ్'లా ఉంటుంది వ్యవహారం. ట్రైలర్ తోనే బాలీవుడ్ ని ఫుల్లుగా ఆకట్టుకుంది ఉడ్తా పంజాబ్. మూవీ రిలీజ్ కి ఇంకా నెలన్నర టైం ఉండగానే.. ఇప్పుడే ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ చూపించేస్తున్నారు యూనిట్.
ఉడ్తా పంజాబ్ కు దర్శకత్వం వహించిన అభిషేక్ చౌబే.. కొన్ని ఇంట్రెస్టింగ్ డీటైల్స్ జనాలతో పంచుకున్నాడు. ఈ మూవీలో నటించిన లీడ్ యాక్టర్స్ అయిన షాహిద్ - కరీనా - ఆలియాలు సగం రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నారంటూ బాంబ్ పేల్చాడు దర్శకుడు. 'ఇది రెగ్యులర్ గా బాలీవుడ్ లో వచ్చే సినిమాల బాపతు కాదనే విషయం వారికి అర్ధమైంది. పంజాబ్ లో ఒక తరహా వేధింపులకు సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ స్టోరీ లైన్. ' అన్నాడు అభిషేక్.
'కథ వినగానే వీరు ముగ్గురూ సినిమాలో భాగం అయ్యేందుకు అంగీకరించారు. అది కూడా వారు రెగ్యులర్ గా తీసుకునే పారితోషికంలో సగం మాత్రమే తీసుకునేందుకు అంగీకరించారు. అయితే, వారు చేసిన రిక్వెస్ట్ ఒకటే. ఈ విషయం మాత్రం బైటకు చెప్పద్దన్నారు' అంటూనే చెప్పేశాడు దర్శకుడు. ఇలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు బైట తెలిస్తే.. మిగతావాళ్లు కూడా అలాగే అడుగుతారని వాళ్ల ఫీలింగ్ అట.