'అర్జున్ రెడ్డి' లాంటి కల్ట్ సినిమాను రీమేక్ చేయడం అంటే సాహసమే. పైగా 'అర్జున్ రెడ్డి' లో విజయ్ దేవరకొండ నటన నెవర్ బిఫోర్ అనే స్థాయిలో ఉండడంతో ఆ పాత్రను రీమేక్ లో పోషించడం ఎలాంటి నటుడికైనా కష్టమైన విషయమే. ఎందుకంటే.. ఎంత కష్టపడి నటించినా.. ఆఖరికి విజయ్ ను మ్యాచ్ చేయగలిగినా సరే.. పోలికలు నిట్టూర్పులు తప్పవు. అయితే అలాంటి ఛాలెంజ్ ను స్వీకరించాడు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్.
ఈ సినిమాకు 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ వంగా స్వయంగా దర్శకత్వం వహిస్తుండడం షాహిద్ కు ఎంతో ప్లస్ అయ్యే అంశం. ఈ పాత్ర కోసం ఎంత ఎఫర్ట్ పెట్టినప్పటికీ సౌత్ లో ఆడియన్స్ మాత్రం ఒరిజినల్ తో పోలికలు తెస్తారని తెలుసు కాబట్టే ముందు జాగ్రత్తగా షాహిద్ 'కబీర్ సింగ్' ను ఓపెన్ మైండ్ తో చూడమని కోరుతున్నాడు. అయితే నార్త్ ఆడియన్స్ కు ఈ సినిమా డిఫరెంట్ గా అనిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఇక హిందీలో ఈ సినిమా నేపథ్యం ఢిల్లీకి మారుతుందని.. దానికి తగ్గట్టే కొన్ని మార్పులు ఉన్నాయని చెప్పాడు. రీమేక్ లో హీరో పంజాబ్ నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో టైటిల్ ను 'కబీర్ సింగ్' అని పెట్టామని చెప్పాడు. ఈ టైటిల్ ను సూచించింది దర్శకుడు సందీపే అని వెల్లడించాడు. ఇక కబీర్ సింగ్ పాత్ర పోషించడం ఛాలెంజింగ్ అనే విషయాన్ని ఒప్పుకున్నాడు. గతంలో 'ఉడ్తా పంజాబ్' సినిమాలో షాహిద్ టామీ సింగ్ అనే డ్రగ్ అడిక్ట్ సింగర్ పాత్రలో నటించాడు. తన నటనతో అందరినీ మెప్పించాడు. ఇప్పుడూ కూడా అలాంటి అనుభవమే అని కాకపోతే ఇది నెక్స్ట్ లెవెల్ అన్నాడు. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే.. రియల్ లైఫ్ లో షాహిద్ కు స్మోకింగ్.. డ్రింకింగ్..లాంటివి ఎలాంటి అలవాట్లు లేవు. మరి ఇలాంటి పాత్రలు తనకు ఎంత ఛాలెంజింగ్ అవుతాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు.
అది ప్రస్తావిస్తూ "రెండు ప్రపంచాలు భిన్నమైనవి. నేను కనుక ఒక్కడినే అయితే.. సింగిల్ గా ఉంటే.. ఒక ఆరు నెలల పాటు ఆ పాత్రలో డార్క్ జోన్ లో ఉండిపోయేవాడిని. ఉడ్తా పంజాబ్ సమయంలో నేను అలాగే చేశాను. కానీ ఇప్పుడు మాత్రం అలా చేయలేను. ఎందుకంటే ఇప్పుడు వైఫ్.. పిల్లలు ఉన్నారు. నేను ఈ పాత్రకు సంబంధించిన బ్యాగేజ్ ను ఇంటికి తీసుకెళ్ళలేను. ఎందుకంటే పిల్లలపై నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అందుకే ప్యాకప్ అనగానే కబీర్ సింగ్ స్విచ్ ఆఫ్ చేసేవాడిని." అన్నాడు. ఇక పాత్ర గురించి చెప్తూ "నేను చేసే క్యారెక్టర్ నుఎప్పుడూ జడ్జ్ చేయను. నేను ఆ పాత్రలాగా మారిపోతాను. టామీ ఒక క్రేజీ మనిషి. డ్రగ్స్ అతని జీవితాన్ని నాశనం చేశాయి. కానీ కబీర్ సింగ్ లవ్ ఇంటెన్స్ గా ఉంటుంది. అందుకే ఆ ప్రేమకు దూరమైనప్పుడు సెల్ఫ్ డిస్ట్రక్షన్ బటన్ ప్రెస్ చేస్తాడు" అన్నాడు.