హీరో పెద‌విని తాకిన బంతి.. 25 కుట్లు వేసార‌ట‌

Update: 2021-11-29 07:08 GMT
షాహిద్ క‌పూర్ క‌థానాయ‌కుడిగా టాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ `జెర్నీ`ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. మెగా నిర్మాత అల్లు అర‌వింద్ గీతా ఆర్స్ట్ పై హిందీలో నిర్మిస్తున్నారు. మాతృక‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన గౌత‌మ్ తిన్న‌నూరి ఈ రీమేక్ ని డైరెక్ట్ చేస్తున్నారు. రంజీ ఆట‌గాడి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కించిన ఈ చిత్రంలో క‌థానాయ‌కుడి పాత్ర ఎంతో ఎమోష‌న‌ల్ గా సాగుతుంది. ఇటీవ‌లే షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అయితే ఇది క్రికెట్ నేప‌థ్యంలో సినిమా కావ‌డంతో హీరో చాలా సాహ‌సాలే చేయాల్సి వ‌చ్చింద‌న్న విష‌యాన్ని షాహిద్ క‌పూర్ తాజాగా వెల్ల‌డించారు.

తాజా ఇంట‌ర్వ్యూలో ఈ సినిమా కోసం తాను ఎంత‌గా క‌ష్ట‌ప‌డ్డాడో షాహిద్ రివీల్ చేసారు. సినిమా కోసం ప్రాక్టీస్ లో గాయ‌ప‌డ్డానని తెలిపారు. క్రికెట్ సాధ‌న చేస్తున్న‌ప్పుడు బౌల‌ర్ వేసిన బంతి పెద‌వికి బ‌లంగా తాకింది. దీంతో తీవ్ర గాయం అయ్యింది. దీంతో 25 కుట్లు పడ్డాయ‌ట‌. మ‌ళ్లీ జీవితంలో పెద‌వి క‌ద‌ప‌డం క‌ష్ట‌మ‌ని భావించాడుట‌. కోలుకోవ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టింద‌ని తెలిపారు. దాదాపు రెండు నెల‌లు పాటు షూటింగ్ కూడా ఆపేసారుట‌. ఆ స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు మిగ‌తా న‌టీన‌టుల‌పై స‌న్నివేశాలు చిత్రీక‌రించార‌ని షాహిద్ తెలిపారు.

స్పోర్స్ట్ నేప‌థ్యంతో తెర‌కెక్కే సినిమాల విషయంలో న‌టులు రిస్క్ తీసుకోక త‌ప్ప‌దు. అప్పుడ‌ప్పుడు ఇలాంటి గాయ‌లు స‌హ‌జంగా జ‌రుగుతుంటాయి. అయితే ఒక్కోసారి గాయాలు ప్రాణాంత‌కంగాను మారుతాయి. అంత‌ర్జాతీయ మ్యాచుల్లో క్రికెట్ ఆడుతూ బంతి ముఖానికి త‌గిలి మ‌ర‌ణించిన బ్యాట్స్ మెన్లు.. అంపైర్లు కొంద‌రు ఉన్నారు. కొన్ని రిస్కీ స‌న్నివేశాలు షూట్ చేసేట‌ప్పుడు ప్ర‌మాద‌వశాత్తు గాయ‌ప‌డిన న‌టులు చాలా మంది ఉన్నారు. ఏది ఏమైనా క్రికెట్ బంతితో భ‌ద్ర‌త త‌ప్ప‌నిస‌రి. హెల్మెట్ ధ‌రించి మాత్ర‌మే క్రికెట్ ఆడాలి అన్న విష‌యం మాత్రం విస్మ‌రించ‌కూడ‌దు.




Tags:    

Similar News