హీరోని పెంపుడు కుక్కగా మార్చేసిన భార్య

Update: 2016-06-03 05:02 GMT
కరీనా కపూర్ కి లవర్ గా బాగా ఫేమ్ అయ్యి.. తర్వాత హీరోగా సెటిల్ అయ్యాడు షాహిద్ కపూర్. బెబోతో అఫైర్ ఫెయిల్ అయిన తర్వాత.. చాలాకాలం సినిమాలే చేసుకున్న షాహిద్.. గతేడాది పెళ్లి చేసుకున్నాడు. మీరా రాజ్ పుత్ అనే సినీ రంగానికి సంబంధం లేని పంజాబీ అమ్మాయిని పెళ్లాడి బిందాస్ గా కాపురం చేసేసుకుంటున్నాడు. ఇప్పుడు తన భార్య తనను పెంపుడు కుక్కలా చేసేసిందని చెప్పడంతో.. అందరూ షాక్ తినాల్సి వచ్చింది.

'సింపుల్ గా చెప్పాలంటే.. పెళ్లయ్యాక నా పరిస్థితి కట్టేసిన కుక్కలా ఉంది. నా భార్య చెప్పినట్లుగానే వింటూ.. ఓ పరిధిలో నడుచుకుంటున్నా. ఇంకా చెప్పాలంటే మంచి భర్తలా మారిపోయా. ఇందుకు కారణం నా భార్య మీరానే' అని చెప్పాడు షాహిద్. ఇదంతా ఆమె మీద ఆరోపణలా కాదండోయ్.. తన వైఫ్ తనను అంత గొప్పగా చూసుకుంటోందని చెప్పడమే షాహిద్ ఉద్దేశ్యం.

గతేడాది జూలైలో ఈ జంట పెళ్లి చేసుకోగా.. త్వరలో వీరింటికి ఓ బుజ్జాయి కూడా రానుంది. ప్రస్తుతం మీరా గర్భవతి. మరి మీకు అమ్మాయి కావాలా.. అబ్బాయి కావాలా.. అంటే షాహిద్ ఇస్తున్న ఆన్సర్ ఒకటే. 'మాకు అలాంటి తేడాలు ఏవీ లేవు. ఎవరైనా పర్లేదు' అంటున్నాడు కట్టేసిన కుక్కలాంటి భర్త షాహిద్ కపూర్.

Tags:    

Similar News