ఫోటో స్టొరీ : మహేష్ కు తోడుగా కబీర్ సింగ్

Update: 2019-05-18 05:06 GMT
అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ పుణ్యమా అని తెలుగు ప్రేక్షకులు షాహిద్ కపూర్ వైపు ఓ లుక్ వేస్తున్నారు. ట్రైలర్ నచ్చడంతో బాలీవుడ్ వెర్షన్ ఎలా వచ్చి ఉంటుందో అన్న ఆసక్తి ఇక్కడి వాళ్లకు లేకపోలేదు.  సీనియర్ హీరోగా షాహిద్ కపూర్ రెగ్యులర్ గా హింది సినిమాలు చూసే వాళ్లకు సుపరిచితుడే. తాజాగా షాహిద్ ఓ ఘనత సాదించాడు. దానికి మన మహేష్ బాబుకి లింక్ ఉండటం విశేషం.

ఆ మధ్య ఎఎంబి సినిమాస్ సూపర్ ప్లెక్స్ లో మహేష్ మైనపు బొమ్మ ఆవిష్కరించిన సంగతి గుర్తుందిగా.  సింగపూర్ టుస్సాడ్ మ్యూజియం కోసం లాంచ్ చేసిన ఆ స్టాచ్యూని తర్వాత అక్కడికే తరలించారు. అభిమానులు ఎన్నడూ మర్చిపోలేని క్షణమది. ఇప్పుడు షాహిద్ కపూర్ కూడా ఈ ఘనతను అందుకున్నాడు. అయితే ప్రిన్స్ కు దక్కినట్టు ఇక్కడే ఆవిష్కరించే అవకాశం దొరకలేదు కానీ తనే స్వయంగా సింగపూర్ వెళ్ళాడు

స్వయంగా విగ్రహం పక్కన ఫోటో దిగి ఫ్యాన్స్ కు కానుక ఇచ్చాడు. నిజం ఏది బొమ్మ ఏది అని గుర్తుపట్టడం కష్టం అనేంత సహజంగా వాటిని తీర్చిదిద్దారు. షాహిద్ తో పాటు సింగపూర్ ట్రిప్ లో మీరా రాజపుత్ కూడా ఉంది. కబీర్ సింగ్ విడుదల కోసం ఎదురు చూస్తున్న షాహిద్ అది తనను ఎక్కడికో తీసుకెళ్తుందన్న నమ్మకంతో ఉన్నాడు. నిజానికి ఇంత సీనియారిటీ ఉన్న హీరో చేయాల్సిన పాత్ర కాదని ముందు కామెంట్స్ వచ్చినా ట్రైలర్ చూసాక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అందరి నోళ్ళకు తాళం వేశాడు. గత ఏడాది పద్మావత్ ఈ సంవత్సరం కబీర్ సింగ్ మొత్తానికి షాహిద్ కెరీర్ ఈ మధ్య కాలంలో బాగా ఊపందుకుంది


Tags:    

Similar News