ఇటీవలి కాలంలో కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ వరుసగా చెత్త కాన్సెప్టుల్ని ఎంచుకుంటూ పరమ రొటీన్ గా కనిపిస్తున్నాడన్న విమర్శలొస్తున్నాయ్. అందుకు సింబాలిక్ గానే ఇటీవలే ఓ ఇంటరాక్షన్ లో షారూక్ పై అభిమాని స్పందించిన తీరు బాలీవుడ్ లో చర్చకొచ్చింది. అసలు మీరు నటించడం ఎప్పుడు నేర్చుకుంటారు? అని ప్రశ్నించాడు. ఆ దెబ్బకి షారూక్ కి కళ్లు భైర్లు కమ్మాయ్. చెమటలు పట్టేశాయ్. నా నటన - నా సినిమాలు మరీ అంత చెత్తగా ఉన్నాయా? అని ఎంతో తరచి చూసుకున్నాడు.
17 నిమిషాల గ్యాప్ తర్వాత ఏ నటుడూ జీవిత కాలంలో నటన నేర్చుకోలేడు అంటూ తెలివైన సమాధానం చెప్పాడు. కానీ ఆ సమాధానం చెప్పేందుకు చాలా ఆలోచించాల్సి వచ్చింది. షారుక్-కాజోల్ జంటగా నటించిన 'దిల్ వాలే ఫలితం చూశాక షారూక్ కి మరోసారి ముచ్చెమటలు పోశాయి. ఓ వైపు పోటీబరిలో దిగిన భాజీరావ్ మస్తానీ అంతకంతకూ వసూళ్లు పెంచుకుంటూ ముందుకు సాగిపోతుంటే దిల్ వాలే మాత్రం నాలుగో రోజే చతికిలబడిపోయింది. అదే ఫక్తు తెలుగు కమర్షియల్ సినిమాలా ఉందే అన్న బ్యాడ్ టాక్ వచ్చింది. నా సినిమా విదేశాల్లో ఆడినంతగా స్వదేశంలో ఆడలేదు. భారత్ నుంచి కేవలం 145 కోట్లు మాత్రమే వచ్చింది అంటూ లెక్క చెప్పాడు. ఆడాల్సినంత ఆడలేదు. బాగా నిరాశ చెందానని షారూక్ చెప్పాడు.
చెత్త కంటెంట్ ఎక్కడైనా ఒక్కటే. ఎంత పెద్ద హీరో అయినా ప్రేక్షకులు నిర్ధయగా తిరస్కరిస్తారనడానికి ఇదో పెద్ద ఎగ్జాంపుల్.