ఐదేళ్లుగా కింగ్ ఖాన్ షారూక్ కి ఏదీ కలిసి రావడం లేదు. 2018-19 సీజన్ ఇంకా తీవ్రంగా నిరాశపరిచింది. ఇది వెరీ బ్యాడ్ సీజన్. అతడు నటించిన సినిమాలన్నీ ఒక్కొక్కటిగా రిలీజై తీవ్రంగా నిరాశపరిచాయి. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచి అతడి పరువు మర్యాదల్ని మంట కలిపాయి. అయితే ప్రతి ఒక్కరికీ ఇలాంటి ఫేజ్ ఒకటి ఉంటుందనడంలో సందేహం లేదు. దీనినుంచి ఎలా అయినా బయటపడాలని చేసిన భారీ చిత్రం `జీరో` సైతం షారూక్ కి ఖంగు తినిపించింది. మరుగుజ్జు పాత్రలో ప్రయోగాత్మకంగా కనిపించినా జనం తిరస్కరించారు. ఆ తర్వాత ఎందుకనో షారూక్ చాలానే డైలమాలో ఉన్నట్టు అర్థమవుతోంది.
అయితే అతడి డైలమాకి కారణం .. ఇప్పటివరకూ ఎవరూ తనకు నచ్చిన సరైన స్క్రిప్టు వినిపించలేదట. ప్రస్తుతం అతడు ఓ భారీ యాక్షన్ సినిమాలో నటించాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ తన అంచనాల్ని చేరుకునే రేంజు స్క్రిప్టు రాలేదట. ఇదివరకూ డాన్ సీక్వెల్ లో నటించేందుకు ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వచ్చినా ఆ ఆలోచనల్ని ప్రస్తుతం విరమించుకున్నాడు. ఓ కొత్త జోనర్ యాక్షన్ స్క్రిప్ట్ కోసం వేచి చూస్తున్నాడు. ఆ సంగతులన్నీ ఓ ఇంటర్వ్యూలో కింగ్ ఖాన్ వెల్లడించారు.
మెల్ బోర్న్ లో జరుగుతున్న ఇండియన్ పిలింఫెస్టివల్స్ కి వెళ్లిన షారూక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..యాక్షన్ సినిమా చేయాలనుకుంటున్నానని తెలిపారు. ``కిక్ యాస్ స్క్రిప్టు కోసం చూస్తున్నా. ఎవరైనా అలాంటి స్క్రిప్టు ఉంటే ఇవ్వండి. @iamSRK .. ఇదీ నా ట్విట్టర్ ఐడీ. అక్కడ నాకు `సింగిల్ లైన్ స్టోరీ`ని పంపండి. స్క్రిప్టులు ఉంటే పంపండి. రెండేసి లైన్లలో పంపినా ఆలోచిస్తాను`` అని అన్నారు. అంతేకాదు మునుపెన్నడూ లేనంతగా ఒక మంచి స్క్రిప్టు తనవైపు వస్తే వెంటనే అవకాశం ఇచ్చేందుకు కింగ్ ఖాన్ షారూక్ ఆసక్తిని కనబరచడం విశేషం. అతడు పబ్లిగ్గా ఈ ఆఫర్ ఇచ్చారు కాబట్టి అందుకు తగ్గట్టే ఔత్సాహిక దర్శకుల వద్ద నుంచి విరివిగా స్క్రిప్టులు క్యూ కడతాయనడంలో సందేహం లేదు.