వెండి తెరపై మోస్ట్ సక్సెస్ ఫుల్ రొమాంటిక్ కపుల్ ఆ జోడీ. తెరపై కనిపిస్తే చాలు పూలవర్షం కురిపించి ఫ్యాన్స్ విజిల్స్ తో మోతెక్కించేస్తారు. ఈ జంట నటించిన ఓ ప్రేమకథా చిత్రం ఓ థియేటర్ లో 1009 వారాలు (దాదాపు పదిహేనేళ్లు పైగానే) ఆడిందంటే ఎంతటి సంచలనమో అర్థం చేసుకోవచ్చు. ఆ జంట మధ్య ఆన్ స్క్రీన్ రొమాన్స్ కి ఫిదా అవ్వని వారే ఉండరు. ఆ ఇద్దరూ ఒకరికోసం ఒకరు అన్నట్టుగా అలరిస్తారు. అందుకే కలిసి వరుసగా సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆ ఇద్దరూ వెటరన్ స్టార్స్. ఆ ఇద్దరూ ఎవరో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. కింగ్ ఖాన్ షారూక్- అందాల కాజోల్ గురించే ఇదంతా.
సెన్సేషనల్ హిట్ చిత్రం దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే (డీడీఎల్.జే) గురించి చెప్పాల్సిన పనే లేదు. ఈ మూవీలో రొమాంటిక్ పెయిర్ గా హిందీ చలనచిత్ర పరిశ్రమలోనే చెరగని ముద్ర వేశారు. అయితే షారూక్ తో కాజోల్ తొలి పరిచయం ఎలా జరిగిందో కానీ.. తన హీరోయిన్ పై సాటి హీరోకి ఉన్నవీ లేనివీ నూరి పోశాడట షారూక్. అది కూడా కాజోల్ ని తన సినిమాకి ఎంపిక చేసుకోవాలని తపించిపోయిన మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కి అతడు ఓ బ్యాడ్ అడ్వయిజ్ ఇచ్చాడు. ఇంతకీ ఏమిటా సలహా అంటే? .. కాజోల్ తో కలిసి పనిచేయవద్దని షారూఖ్ ఖాన్ అమీర్ ఖాన్ ను హెచ్చరించారట. ``ఆమె చాలా చెడ్డది.. చేసే పనిపై అస్సలు దృష్టి పెట్టలేదు. తనతో నటిస్తే ఇబ్బంది పడతావ్!`` అని అమీర్ ని హెచ్చరించాడట.
అయితే అలా వార్నింగ్ ఇచ్చాక ఆ జంట బాలీవుడ్ లోనే అత్యుత్తమ శృంగార జంటలలో ఒకరిగా పాపులరయ్యారు. కానీ షారుఖ్ ఖాన్ - కాజోల్ మొదటిసారి కలిసి నటించినప్పుడు ఒకరినొకరు అపార్థం చేసుకున్నారని ఆ సలహాని బట్టి అర్థమవుతోంది. వాస్తవానికి.. కాజోల్ గురించి అమీర్ ఖాన్ ను హెచ్చరించానని షారూక్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు. నేను కాజోల్ బాజీగర్ చిత్రంలో నటిస్తున్నప్పుడు.. అమీర్ (ఖాన్) ఆమెతో కలిసి పనిచేయాలనుకుంటున్నానని చెప్పాడు. కాజోల్ గురించి నన్ను అడిగాడు. ``ఆమె చాలా చెడ్డది.. నటనపై దృష్టి పెట్టదు. మీరు ఆమెతో కలిసి పనిచేయలేరు`` అని నేను అతనికి ఒక సందేశాన్ని పంపాను. అటుపై నేను సాయంత్రం తనతో కలిసి నటించిన రషెస్ చూశాను. నేను అపార్థం చేసుకున్నానని చెప్పేందుకు అమీర్ కు ఫోన్ చేస్తూనే ఉన్నాను. అయితే ఆ తర్వాత అతడు నాతో ఓ మాటన్నాడు.``అదేమిటో నాకు తెలియదు కానీ.. ఆమె తెరపై కనిపిస్తున్నంత సేపూ ఏదో మాయాజాలం మత్తు చల్లుతోంది`` అని అమీర్ ఖాన్ నాతో అన్నాడు.. అని షారూక్ చెప్పడం విశేషం. ఆ తరవాత అమీర్ ఖాన్ సరసన కాజోల్ పలు చిత్రాల్లో నటించింది. బాలీవుడ్ యాక్షన్ స్టార్ అజయ్ దేవగన్ ని కాజోల్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. తెలుగులో అరవింద స్వామి సరసన `మెరుపుకలలు` (ద్విభాషా) చిత్రంలో నటించింది. ప్రభుదేవా ఆ చిత్రానికి దర్శకత్వం వహించారు.