ప్రపంచంలో అత్యంత రిచ్ స్టార్స్ వీరే!

Update: 2017-02-01 10:00 GMT
ప్రపంచ దేశాల్లో అన్ని రంగాల్లోనూ భారత్ కు ఉన్న స్థానం ప్రత్యేకం. జనాభా - రాజకీయాలు - క్రికెట్ - సినిమాలు... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచ వేదికపై భారత్ కచ్చితంగా తన స్థానాన్ని తాను కాపాడుకుంటూ వస్తుంది. ఈ క్రమంలో సినిమాల విషయంలో ఇండియన్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే సంపాదన విషయంలోకూడా ప్రపంచవ్యాప్తంగా భారతీయ నటులకు మంచి స్థానమే ఉంది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ధనవంతులైన నటీనటుల వివరాలు వెలుగులోకి వచ్చాయి.

పాపులారిటీ విషయంలోనే కాకుండా సంపాదన విషయంలో కూడా బాలీవుడ్ స్టార్స్ ప్రపంచవ్యాప్తంగా టాప్ 40లో నాలుగు స్థానాలు సంపాదించుకున్నారు. వీరిలో బెస్ట్ పొజిషన్ లో నిలిచారు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. నాలుగువేల కోట్ల రూపాయల నికర ఆస్తులతో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ధనవంతులైన స్టార్స్ లిస్ట్ లో ఐదవ స్థానంలో నిలిచి రికార్డ్ సృష్టించాడు. ఒకపక్క హీరోగా రాణిస్తూనే మరోవైపు నిర్మాతగా మరోవైపు కోల్ కతా నైట్ రైడర్స్ ఐపిఎల్ క్రికెట్ జట్టు యజమానిగా... ఇలా మొదలైన వ్యాపారాలతో షారుఖ్ ఇండియాలోనే అత్యంత ధనవతుడైన నటుడిగా స్థానం సంపాదించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రపంచ వ్యాప్తంగా కూడా షారుఖ్ - బాద్ షా అని తాజా లిస్ట్ తో తెలిసిపోయింది.

ఇక మిగిలినవారిలో 1,564 కోట్ల రూపాయల నికర ఆస్తులతో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ధనవంతులైన నటుల లిస్ట్ లో 26వ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఈ మధ్య కాలంలో వరుసపెట్టి వందకోట్ల కలెక్షన్స్ సంపాదిస్తున్న సల్మాన్... వ్యక్తిగత సంపాదనలో కూడా దూసుకెళ్తున్నాడు.

ఇదే క్రమంలో 1,224 కోట్ల రూపాయల నికర ఆస్తులతో ఈ జాబితాలో 33వ స్థానాన్ని సంపాదించుకున్నాడు బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్. బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా - నిర్మాతగా - దర్శకుడిగా తనదైన శైలిలో దూసుకుపోతున్న ఈ ఖాన్ సంపాదనలో కూడా తనస్థానికి నిరూపించుకున్నాడు.

ఈ ఖాన్ త్రయం అనంతరం ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్నాడు బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్. 1,156కోట్ల రూపాయల నికర ఆస్తులతో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ధనవంతులైన నటుల జాబితాలో 35 వ స్థానాన్ని సంపాదించుకుని బాలీవుడ్ ఖిలాడీ కాస్త ఇంటర్నేషనల్ ఖిలాడీ అయిపోయాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News