ఇప్పుడైతే తెలుగు సినిమాల్లో పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు లాంటోళ్ల రెఫరెన్సులు ఎక్కువైపోయాయి కానీ.. ఒకప్పుడంతా మెగాస్టార్ జపమే చేసేవాళ్లు. అందరూ ఆయన్ని అనుకరించడానికే ప్రయత్నించేవాళ్లు. ఐతే చరిత్ర సంగతి పక్కనబెడితే.. వర్తమానంలోనూ ఓ కమెడియన్ మెగాస్టార్ ను ఇమిటేట్ చేయడానికి మంచి ప్రయత్నమే చేశాడు. ఆ కమెడియన్ మరెవరో కాదు.. షకలక శంకర్. సంక్రాంతికి సందడి చేయబోతున్న‘ఎక్స్ ప్రెస్ రాజా’ సినిమాలో షకలక శంకర్ చిరును అనుకరించే పాత్ర చేశాడు. అతడి పాత్ర పేరు భీభత్స నటరాజ్.
80ల్లో చిరు గెటప్ గుర్తుకొచ్చేలా షకలక శంకర్ ను బాగానే తయారు చేశాడు మేకప్ మ్యాన్. ఈ భీభత్స నటరాజ్ పాత్రలో డ్యాన్స్ చేస్తున్న శంకర్ ను సడెన్ గా చూస్తే నిజంగానే చిరంజీవే అని పొరబాటు పడతాం. అలా తయారు చేశారు అతణ్ని. మరి ఈ భీభత్స నటరాజ్ తెర మీద ఎంత సందడి చేస్తాడో చూడాలి.గత కొన్ని రోజులుగా ‘ఎక్స్ ప్రెస్ రాజా’ క్యారెక్టర్లను సోషల్ మీడియాలో పరిచయం చేస్తూ సినిమాను ప్రమోట్ చేస్తోంది చిత్ర యూనిట్. కేశవ రెడ్డిగా హరీష్ ఉత్తమన్ - మావయ్య శ్రీనుగా ప్రభాస్ శీను - బినామీ బ్రిటిష్ గా సుప్రీత్.. ఇలా కొన్ని పాత్రలు ఇప్పటికే జనాలకు పరిచయమయ్యాయి. ఈ రోజు భీభత్స నటరాజ్ ను జనాలకు ఇంట్రడ్యూస్ చేశారు.